జాన్ గుటెన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనుగొనక ముందు, ప్రపంచంలో పుస్తకాలన్నిటినీ చేత్తోటే రాయాల్సి వచ్చేది. పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు తమకు నచ్చిన గ్రంధాలను 'వ్రాయసగాళ్ళ' చేత చేత్తో రాయించి, ఆ వ్రాత ప్రతుల్నే తమకు నచ్చిన వాళ్ళకు బహుమతులుగా ఇస్తుండేవాళ్ళు. అయితే ఒకసారి ముద్రణ యంత్రాలు తయారవ్వటం మొదలెట్టాక, అవి ఇంక అన్ని దేశాలలోకీ మెరుపువేగంతో చొచ్చుకొని పోయాయి.