TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తెలుగువన్-అక్షరయాన్ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కవితల పోటీలో తృతీయ బహుమతి రూ. 1,116 గెలుపొందిన కవిత యుగళిధార
సీ.
యుగయుగాలయుగాది యుజ్వలభవితలో
ప్రజలలోనిండుగా రమ్యతొసగి
తీపిచేదువగరు చింతమామిడిపులుపు
సమపాళ్ళయందన సకల మయెను
అందరూ యాత్మీయ యనురాగ మందున
పంచారు పచ్చడి మధురిమలయి
పేదగొప్పాయని బేదము లేదు యు
గాది హిందువుల యుగ్మమునయేగ
తే
భానుడుదయించ కమునుపే బండ్ల కట్రి
కర్షకులయి యారుకొనుచు కాంతులిరిసి
ఉత్సహమయులు నిలిచారు యున్న తముగ
పుడమి నిండుగా యుండాలి పులకరించి.
.ఆ.
పసిడి పంట నిలుపు పైరుపచ్చధనము
పండితంబు నిలిచె పలుకు లల్లి
వేద విజ్ఞు లందు విజ్ఞాన మందించి
దేశ భవిత యెటుల దివ్య ముగను.
ఆ.
విజయ మయ్యె నిలిచి విజ్ఞాన మందించి
హృథయ దీప్తి లోన హృదయు లయిరి
మాట లాడి నట్టి పంచాగ శ్రవణులు
దేశ భవిత నిలుపు తేజమొసగి
ఆ.
యుగయుగాలచరిత యుర్విలో మెరిసెను
దరణి ధర్మబొసగె ధార్మికతను
రుధిర చిందియించె లోకమే తానయ్యి
కష్టపడుట లోన కర్షకుడయి
ఆ.
భవిత మెరుపు తీగ భావితరాలలో
నిలిపి యుంచినాడు నిండుగాను
మెతుకు తోని బతుకు మోస్తున్న కర్షక
బందు వయ్య నీవు భవిత లోన
- వి. సంధ్యా రాణి