Facebook Twitter
ఏనుగు-కుక్క

ఏనుగు-కుక్క

 

 

అనగనగా ఒక రాజుగారికి ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగును చూసుకునే మావటి వాడికి ఒక కుక్క ఉండేది. మావటి వాడితో కలిసి ఏనుగు దగ్గరకు వెళ్ళేది కుక్క. ఏనుగు, కుక్క చాలా స్నేహంగా ఉండేవి. కలిసి ఆడుకునేవి. 


ఒక సారి డబ్బు అవసరమయ్యి. మావటి వాడు తన కుక్కను అమ్మేశాడు. బాధపడుతూనే కుక్క కొత్త యజమాని వెంట వెళ్లింది. కుక్క రాకపోయేసరికి, ఏనుగు ఆహారం తీసుకోవటం మానేసింది. నీళ్ళు కూడా తాగటం లేదు.  దానిని పరీక్షించిన వైద్యుడు "ఏనుగుకి ఏ జబ్బూ లేదు. ఇది ఎవరి మీదో బెంగతో ఉంది" అన్నాడు.


"ఈ ఏనుగు రోజూ ఒక కుక్కతో ఆడుకునేది కదా? ఆ కుక్క కనిపించట్లేదు! ఏమైంది దానికి? వెంటనే ఇటు తీసుకుని రండి దాన్ని!" అన్నాడు రాజు. కొత్త యజమానికి ఆ సంగతి తెలిసి వెంటనే కుక్కను పంపించాడు. కుక్కను చూడగానే ఏనుగు లేచి నిల్చున్నది. కుక్క సంతోషంతో గంతులు వేసింది. 

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో