కనులకి నచ్చిన అమ్మాయి...
ఏమని చెప్పను ?
ప్రేమ!
ఈ జీవితం నీదే..!
నీపై నా ప్రేమ నీ చూపులు, నీ నవ్వులు, నీ మాటలు, నీ లేఖలు, నీ వలపులు, నీ తలపులు.... అన్నీ నాలోనే ఉంటూ అనుక్షణం నిన్నే గుర్తుకి తెస్తుంటే...!? ఈ విరహం కూడా సుఖంగానే ఉంది...! నీపై నా ప్రేమలా.........!! -హారిక
జీవితం... పోటీ.. జీవితంలో ఏ పోటీ అయినా పరుగు పందెంలా సాగాలి! ఒకరం ముందు, ఒకరు తరువాత గమ్యం చేరుకోవచ్చు! అలా కాకుండా మల్ల యుద్ధంలా మార్చేసుకుంటే... ఒకరు పడిపోతేనే మరొకరు నిలవాల్సి వస్తుంది! పరుగు పందెమా, మల్ల యుద్ధమా... మన భావంలోనే వుంది!
వేట ఒకప్పుడు మనిషి వేటాడి బతికేవాడు.. ఇప్పుడు డబ్బులు సంపాదించుకుని బతుకుతున్నాడు. వేట హింసాత్మకమైందా..? డబ్బు సంపాదన హింసాత్మకమైందా..? డబ్బు సంపాదన వేటలో హత్యలు మాత్రమే ఉంటాయి. డబ్బు సంపాదనలో ఆత్మహత్యలు కూడా ఉంటాయి -జేఎస్ చతుర్వేది
జీవితమనే జిమ్ లో... మాయ అనే ట్రెడ్ మిల్ పై, పడిపోకుండా పరిగెత్తుతూ... కోరికనే కొవ్వుని కరిగించినప్పుడు... శరీరం వైరాగ్యపు చెమటతో మిలమిల మెరిసిపోతుంది! దాన్నే సన్యాసపు సిక్స్ ప్యాక్ అంటారు!
జ్ఞానం పుస్తకాలు కొంటే జ్ఞానం వస్తుంది! కానీ ఏ పుస్తకాలు కొనాలన్నా జ్ఞానం.... ముందుండాలి! -జేఎస్ చతుర్వేది
ప్రాణం గుడ్డు లోపల నుంచి పగిలితే ప్రాణం పుడుతుంది.. గుడ్డు బయట నుంచి పగిలితే ప్రాణం పోతుంది!! - జేఎస్. చతుర్వేది
నీకే అంకితం నువ్వు ఎదురుచూసే చూపు నాకోసమే అయితే.. నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణం నాకోసమే అయితే.. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నాకోసమే అయితే.. నా జీవితం నీకే అంకితం
సాధించటం అంటే... కోల్పోవటమే! 'యమున' అంటే అనాది 'కాలం'! ఆ కాలంలో 'మాయ' అనే 'తరంగాల' మధ్య... 'గోపిక'లనే 'జీవాత్మ'లు జలకాలాడుతుంటారు! 'పరమాత్ముడైన' శ్రీకృష్ణుడు అనుగ్రహించదలిచినప్పుడు... జీవాత్మలైన గోపికల 'మమకారానికి' సంకేతమైన... ఒడ్డులోని 'వస్త్రాల్ని' దయతో అపహరిస్తాడు! అప్పుడు మమకారం కోసం 'లజ్జ' (శారీరిక స్పృహనే) అహంకారం వదిలి... జీవాత్మలు పరమాత్ముడి 'సన్నిధి'కి చేరుతాయి! పరమాత్ముని ఎదుట మమకార, అహంకారాలు 'కోల్పోవ'టమే... మోక్షం 'సాధించటం' అంటే! -జేఎస్ చతుర్వేది
ఆ కదిలికే ప్రేమ భార్య, భర్త... చెట్టు , గాలి లాంటి వారు! భార్య చెట్టులా కదలకుండా స్థిరంగా వున్నట్టు కనిపించినా.. గాలికి కదులుతూనే వుంటుంది! గాలి ఎక్కడా నిలుచోక కదులుతున్నట్టే వున్నా... చెట్టుని కదిలిస్తూనే , పరామర్శిస్తూనే వుంటుంది! బహుశా ఆ 'కదిలికే' ప్రేమ అంటారనుకుంటా....
Nee thalapulu naa madhilo Gadiyarapu mullu vale Nirantharangaa parigeduthunte Ninnelaa vismarinchagalanu