సాధించటం అంటే... కోల్పోవటమే!
posted on Nov 22, 2016
సాధించటం అంటే... కోల్పోవటమే!
'యమున' అంటే అనాది 'కాలం'!
ఆ కాలంలో 'మాయ' అనే 'తరంగాల' మధ్య...
'గోపిక'లనే 'జీవాత్మ'లు జలకాలాడుతుంటారు!
'పరమాత్ముడైన' శ్రీకృష్ణుడు అనుగ్రహించదలిచినప్పుడు...
జీవాత్మలైన గోపికల 'మమకారానికి' సంకేతమైన...
ఒడ్డులోని 'వస్త్రాల్ని' దయతో అపహరిస్తాడు!
అప్పుడు మమకారం కోసం 'లజ్జ' (శారీరిక స్పృహనే) అహంకారం వదిలి...
జీవాత్మలు పరమాత్ముడి 'సన్నిధి'కి చేరుతాయి!
పరమాత్ముని ఎదుట మమకార, అహంకారాలు 'కోల్పోవ'టమే...
మోక్షం 'సాధించటం' అంటే!
-జేఎస్ చతుర్వేది