రేడియో పిజ్జా..
రేడియో పిజ్జా
కండ్లకుంట శరత్ చంద్ర
DJ :- రేడియో పిజ్జా..ఇది చాలా రేటు గురూ..
చెప్పండి రాము గారు
రాము:- పంజాగుట్ట దగ్గర
ఒక పర్స్ దొరికిందండీ.
అందులో 20,000 కాష్,
క్రెడిట్ కార్డ్,అడ్రసు ఉన్నాయి..
అడ్రసు దాసరి గంగాధర్,ఫ్లాట్:203,
సురభి అపార్ట్ మెంట్స్ కుకట్ పల్లి.
DJ :- వావ్, రాము గారు,
మీ నిజాయితీకి ధన్యవాదాలు.
ఆ పర్స్ అతడికి ఎలా ఇవ్వాలని
అడగడానికి కాల్ చేసారా?
రాము:- కాదండీ, ఒక ట్రాజెడీ పాటను
నా తరఫున అతడికి డెడికేట్ చెయ్యండి.
బై