టూరిస్టు
posted on Jul 13, 2013
టూరిస్టు
కండ్లకుంట శరత్ చంద్ర
ఒక అమెరికన్ టూరిస్టు భీమవరం వచ్చాడు.
ఓ కొబ్బరిబొండాల కొట్టు కు వెళ్ళి
ఓ బోండాం తాగి,అడిగాడు.
"ఎంత?"
"రెండొందలండీ "
"అదేంటి!కోనసీమలో ఎక్కడ చూసిన
కొబ్బరి చెట్లే, బోండాలు ఇక్కడ బాగా
దొరుకుతున్నాయ్ గా,అంత రేటా!!!"
"కొబ్బరిబొండాలు దొరుకుతాయ్ కానీ
అమెరికన్ టూరిస్టులు దొరకరు కదండీ...."