ఈ ఏడుపు ఇంక నా వల్ల కాదే !
posted on Aug 19, 2013
భర్త : ఒసేయ్ రోజూ ఈ ఉల్లిపాయలు కోస్తుంటే
కళ్ళు మండిపోతున్నాయే ...
ఈ ఏడుపు ఇంక నా వల్ల కాదే
భార్య :మిమ్మల్ని ఇలా ఏడిపించడం
నాకేమాత్రమూ ఇష్టం లేదు ...
ఉండండి ఇపుడే వస్తా
భర్త : హమ్మయ్యా ... మొత్తానికి ఉల్లిపాయలు
కోయడానికి ఒప్పుకున్నావ్
భార్య : చూయింగ్ గమ్ తింటూ ఉల్లిపాయలు
కొస్తే కన్నీళ్ళు రావంట ..
మొన్న పేపర్ లో చదివా
ఇదిగో చూయింగ్ గమ్ ...
తింటూ కొయ్యండి