"రక్షించండీ....రక్షించండీ
posted on Jul 18, 2013
"రక్షించండీ....రక్షించం
కండ్లకుంట శరత్ చంద్ర
చెరువు దగ్గర-"రక్షించండీ....రక్షించం
మా అక్క నీళ్ళల్లో మునిగిపోతుంది"
పన్నెండేళ్ళ రాజు కేకలు పెట్టాడు.
వెంటనే నలుగు యువకులు నీటిలో దూకి
ఒక వృద్ధుడిని బయటకు తెచ్చారు.
ఎంత వెదికినా అక్కయ్య కంపించలేదు.
"సారీ బాబూ...మీ తాతయ్య ను మాత్రమే రక్షించగలిగాం,
అక్క కనిపించలేదు" విచారంగా అన్నారు యువకులు.
"థాంక్స్ అంకుల్స్...మునిగిపోయింది
మా అక్క కాదు,తాతయ్యే"
అన్నాడు రాజు