RELATED EVENTS
EVENTS
గొల్లపూడికి "తానా" సాహితీ పురస్కారం

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ చలన చిత్ర నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావుకు తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(తానా) సాహితీ అవార్డును ప్రకటించింది. జూలై ఒకటో తేది నుండి మూడో తేది వరకు శాంతాక్లారాలో నిర్వహిస్తున్నా తానా 18వ మహాసభలలో గొల్లపూడి కి ఈ అవార్డుని అందజేసి సత్కరిస్తున్నట్లు ఆ సంస్ధ అధ్యక్షులు కోమటి జయరాం తెలిపారు. గత ఐదు దశాబ్దాలకు పైగా గొల్లపూడి మారుతీరావు తెలుగు సాహితీ లోకానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నామని జయరాం తెలిపారు. తానా మహాసభలకు గొల్లపూడితో పాటు మురళీమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, కె.విశ్వనాథ్, బాలకృష్ణ , జొన్నవిత్తుల, కొండవలస,శేఖర్ కమ్ముల తదితర చలన చిత్ర రంగ ప్రముఖులు పాల్గొంటున్నారని తెలిపారుగొల్లపూడికి "తానా" సాహితీ పురస్కారం

TeluguOne For Your Business
About TeluguOne
;