RELATED EVENTS
EVENTS
తానా, టాంటెక్స్ వారి ఐటి సెమినార్ లో మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్య

తానా, టాంటెక్స్ వారు సయుక్తంగా టెక్సాస్ లోని ఫన్ ఆసియా, రిచర్డ్ సన్ లో ఆదివారం 23 మార్చిన ఐటి సెమినార్ ను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఇన్ఫర్మేషన్ మరియు టెక్నాలజీ మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సభకు 100కు పైగా తెలుగు ఐటి కంపెనీ CEOలు ఇతర ప్రొఫెషనల్స్ విచ్చేశారు.

తానా కోశాధికారి రామ్ యలమంచలి ముఖ్యఅతిథి, మరియు సభలో పాల్గోన్నవారిని సాదరంగా ఆహ్వానించారు. ఐటి సర్వీస్ అల్లియన్స్ సతీష్ మండవ మాట్లాడుతూ ఐటి ఆర్గనైజేషన్ గురించి వివరించారు. తామందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని, తమవంతు సహాయాన్ని అందించాలని తెలిపారు.

తానా, టాంటెక్స్ వారి ఐటి సెమినార్ లో మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్యతానా, టాంటెక్స్ వారి ఐటి సెమినార్ లో మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్య

 

 

 

 

 

 

 

తానా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం చైర్మన్ నాగేంద్ర బండారు మాట్లాడుతూ స్పెషల్ గ్రీన్ టెక్నాలజీ, హెల్త్ కేర్ టెక్నాలజీ పార్క్ ల యొక్క అభివృద్ధి ఆవశ్యకత గురించి ముఖ్యఅతిథి పొన్నాల లక్షంయ్యకు వివరించారు. Reddy & Neumann P.C. తరపున కార్యక్రమానికి విచ్చేసిన అటార్నీ రాహుల్ రెడ్డి ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీ గురించి ఆసక్తికరమైన స్టాటిస్టిక్స్ విపులంగా చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెరికా కాన్సులర్ ఆఫీస్ వారితో కలిసి పనిచేస్తూ స్టూడెంట్ వీసాల విషయాలు ముఖ్యంగా ట్రై వ్యాలీ యూనివర్సిటీ బాధితుల విషయాలపై వత్తిడి తీసుకురావాలని అభ్యర్థించారు.

పొన్నాల లక్ష్మయ్యను డల్లాస్ కు రప్పించడంలో సఫలీకృతుడైన టెక్నాలజీ అధినేత ఎం.వి.ఎల్.ప్రసాద్ సభకు పరిచయం చేస్తూ .... వరంగల్ జిల్లా మారుమూల గ్రామం నుంచి వచ్చిన పొన్నాల లక్ష్మయ్య గారు తన వూరిలోనే చదువుకుని తరువాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (మెకానికల్) పొంది, 1969 లో ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1978 వరకు వివిధ అమెరికా కంపెనీలలో పనిచేసిన ఆయన ఇండియా తిరిగి వెళ్లిపోయారని, ఇండియాలో పౌల్ట్రీ , డైరీ దాని అనుబంధ సంస్థల ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించారని, రాజకీయరంగంలోకి ప్రేవేశించి నాలుగు సార్లు గెలుపొంది క్యాబినెట్ మినిస్టర్ గా వివిధ శాఖల మంత్రిగా పనిచేసారని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కమ్యునికేషన్స్ మంత్రిగా మరియు మినిస్ట్రీ ఫర్ ఎనర్జీ మంత్రిగా అదనపు బాధ్యతను నిర్వహిస్తున్నారని తెలిపారు.

తానా, టాంటెక్స్ వారి ఐటి సెమినార్ లో మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్యతానా, టాంటెక్స్ వారి ఐటి సెమినార్ లో మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్య

 

 

 

 

 

 

 

ముఖ్యఅతిథి పొన్నాల సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ఐటి సంస్థల గురించి వివరించారు. గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఐటి సంస్థలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని, ఎగుమతులు 100 రెట్లు పెరిగాయని, అలాగే ఉపాధి కూడా ఇరవై రెట్లు పెరిగిందని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఐటి సంస్థలు ప్రారంభించాలని సభలో పాల్గొన్న వారికి సూచించారు.

సభలో పాల్గొన్న వారి ప్రశ్నలకు జవాబులిస్తూ Tier-2 సిటీస్ లో ఐటి అభివృద్ధి, అభివృద్ధి చెందిన బేసిక్ ఫ్రేం వర్క్ గురించి ప్రశ్నించినప్పుడు పొన్నాల సమాధానం చెబుతూ వారికి కావలసిన అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వం సహాయసహకారాలు తప్పక అందిస్తామని చెప్పారు. రూరల్ ప్రాంతాలలోని నివసించే చదువుకున్న వారికి నేటి డిమాండ్లకు అనుగుణంగా చక్కని సాంకేతిక మెళకువలు అందిస్తామని తెలిపారు.

తానా ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తెలుగు కమ్యూనిటీ వారిని ఒక తాటిపైకి తీసుకురావడానికి తాము చేస్తున్న కృషిని వివరించారు. తానా కోర్ కమిటీ సభ్యులను పరిచయం చేస్తూ ఎన్నో ఇతర ఉద్యోగావకాశాలు, ఇతర బిజినెస్ లు ఉన్న ఈ తరుణంలో ఐటి సంస్థల ప్రాధాన్యం గురించి వివరించారు. తానా మరియు టాంటెక్స్ తరపున పొన్నాల లక్ష్మయ్యకు ప్రసాద్ తోటకూర మెమెంటోను అందచేశారు. Reddy & Nuemann PC తరపున సభకు విచ్చేసిన రాహుల్ రెడ్డి, XT Global రామరావు ముళ్ళపూడి, ప్రీమియర్ ఐటి సొల్యూషన్స్ రామ్ బొబ్బ, ఫన్ ఆసియా శబ్నం మొద్గిల్ వారు ఈ కార్యక్రామానికి తమ వంతుగా సహాయసహకారాలను అందించినందుకు పొన్నాల లక్ష్మయ్య గుర్తింపు జ్ఞాపికలను అందచేశారు.

తానా, టాంటెక్స్ వారి ఐటి సెమినార్ లో మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్యతానా, టాంటెక్స్ వారి ఐటి సెమినార్ లో మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్య

 

 

 

 

 

 

 

ఐటి సర్వీసెస్ అలియన్స్ సతీష్ మండువా మరియు ఎన్.ఎం.ఎస్.రెడ్డి, టాంటెక్స్ ప్రెసిడెంట్, తానావారి వివిధ కమిటీ మెంబర్లు శ్రీమతి మంజులత కన్నెగంటి ఆధ్వర్యంలో, రాంకీ చేబ్రోలు మరియు రాజేష్ వీరపనేని పొన్నాల లక్ష్మయ్యను సన్మానించారు. ఆఖరున ఆటా రీజనల్ కో-ఆర్డినేటర్ అరవింద్ రెడ్డి ముప్పిడి, రావు కల్వల, NATA రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పొన్నాలకు పూల బొకేలను అందచేశారు.

ముఖ్యఅతిథి పొన్నాల లక్ష్మయ్య గారు ఎంతో బిజీగా ఉన్నా ఈ సభకు విచ్చేయడానికి సమయం కేటాయించినందుకు టాంటెక్స్ ప్రెసిడెంట్ తమ ధన్యవాదాలను తెలియచేశారు. సభకు విచ్చేసిన వారిని, వాలంటీర్లను, ఆర్ధిక సహాయాన్ని అందించిన వారిని, XT Global, Premier IT Solutions, ITserv Alliance and Reddy & Neumann P.C. FunAsia రెస్టారెంట్ స్టాఫ్, మేనేజ్ మెంట్ వారికి, TV9 వెంకట్ ములుకుట్ల, వీడియో కవరేజ్ చేసిన రాజేంద్ర నారాయణదాస్, డిజిటల్ ఫోటోగ్రఫీ అందించిన వారికి కూడా తమ కృతజ్ఞతలు తెలియచేశారు. ఎన్.ఎం.ఎస్. రెడ్డి గారి వోట్ ఆఫ్ థాంక్స్ తో ఈ కార్యక్రమం ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;