సబ్బం హరి ఏ పార్టీలో ఉన్నట్లు?
Publish Date:Aug 11, 2012
Advertisement
విశాఖజిల్లా ఎంపి సబ్బం హరి తాను గెలిచిన పార్టీనే విమర్శిస్తూ పబ్బ(కాల)ం గడుపుకుంటున్నారని కాంగ్రెస్‌నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అథినేత జగన్మోహనరెడ్డి అరెస్టు సమయంలో తెరపై ప్రత్యక్షమైన ఈయన ఆ తరువాత కాంగ్రెస్‌పై విమర్శలను చేశారు. పలురకాలు విమర్శలు చేస్తూ హరి తాను ప్రకటించినట్లు వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అంతేకాకుండా కాంగ్రెస్నాయకులను పలకరిస్తూ వారితోనే తిరుగుతూ అదేపార్టీని దూషించటం హరి ప్రత్యేకతలా ఇటీవల దుమారం లేస్తోంది. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో మాదిరిగా హరి ఎవరి ద్వారా లబ్దిపొందుతారో వారినే తిడతారని అన్నిపార్టీల నేతలు అంటున్నారు. ఆయన్ని ప్రోత్సహించే వారిదే తప్పుకానీ, హరిది ఏ మాత్రం తప్పుకాదని కూడా తేలుస్తున్నారు. అలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీలో పూర్తిగా చేరలేదు. కనీసం తన నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ వైకాపా అభివృద్థికి చేసిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదని ఈయన ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్రుగా ఉన్నారు. తమ ఎంపి అని చెప్పుకోవటానికే హరి ఉన్నాడని వైకాపా నాయకులు ఒకరు తాజాగా ఆరోపణ చేశారు. ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలతోనే హరి కాలం గడుపుతున్నారని ఆయన వైకాపా సీనియర్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించాలో, లేక హరికి జగన్‌తో ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టించుకోకూడదో సీనియర్లకూ అర్థం కావటం లేదు. ఏమైనా హరి ఎక్కడ ఉంటే అక్కడ గందరగోళమని తాము నవ్వుతూ వ్యాఖ్యానించక తప్పదని వైకాపా నేతలు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/సబ్బం-హరి-ఏ-పార్టీలో-ఉన్నట్లు-24-16438.html





