తెలంగాణాజిల్లాల్లో ఎరువుల నల్లవ్యాపారం?
Publish Date:Aug 11, 2012
Advertisement
తెలంగాణాజిల్లాల్లో ఎరువులను నల్లబజారుకు తరలిస్తున్నారు. ఇక్కడి రైతులను మభ్యపెట్టి నాసిరకం ఎరువులను మాములుధరలకు, కంపెనీ ఎరువులను 50నుంచి వందరూపాయలు ఎక్కువకు వ్యాపారులు అమ్ముతున్నారు. రైతులు కూడా తమకు పెరిగిన అవగాహన వల్ల కంపెనీ ఎరువులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కంపెనీ ఎరువులకు కొత్తడిమాండును వ్యాపారులు సృష్టిస్తున్నారు. నల్గొండజిల్లాలో 72వేల మెట్రిక్టన్నుల యూరియా అవసరం. దీనిలో 39వేల మెట్రిక్టన్నుల యూరియా నాగార్జునఫెర్టిలైజర్స్దే రైతులు వాడతారని తెప్పించి దాన్ని బ్లాక్లో వ్యాపారులు అమ్ముతున్నారు.
బస్తాను 400 నుంచి 450రూపాయల వరకూ వ్యాపారులు అమ్ముతున్నారు. డిఎపీల్లో కోరమండల్కు, ఇఫ్కోకు రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇఫ్కో 50కిలోల బస్తా 1,250రూపాయలకు అమ్ముతున్నారు. నాగార్జున డిఎపి రూ.1250.35కు అమ్ముతున్నారు. వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము కొనుగోలు చేస్తుంటే బస్తాకు 50 నుంచి 75రూపాయల వరకూ కూలి వేస్తున్నారని చెప్పారు. నల్లబజారుకు తరలిస్తున్న ఈ ఎరువులపై జిల్లా వ్యవసాయాథికారులు, రెవెన్యూ సహకారంతో దాడులు చేయాలని పలురు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/తెలంగాణాజిల్లాల్లో-ఎరువుల-నల్లవ్యాపారం-24-16436.html





