ప్రయోగాల పుట్ట టీడీపీ.. ఆర్టిఫిషియల్‌ యాంకర్‌తో యువగళంలో ప్రయోగం!

Publish Date:Jul 20, 2023

Advertisement

కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నది పాత సామెత. ఇప్పుడు ఏ కార్యాన్నయినా కృత్రిమ మేధతో సంపూర్ణంగా నిర్వర్తించవచ్చు. భగవంతుడి సృష్టిలో మనిషి గొప్పవాడు అయితే, మానవ సృష్టిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మహోన్నతమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రపంచం అభివృద్దివైపు దూసుకెళ్తోంది.. టెక్నాలజీ అంతకు మించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు మనిషి చేసే దాదాపు అన్ని పనులూ యంత్రాలు చేయగలుగుతున్నాయి, చేయగలిగేలా మనిషే వాటిని తయారు చేస్తున్నారు.

మనిషి చేయగల ఏ పనినైనా మిషన్స్ మరో 20 సంవత్సరాల్లోచేస్తాయని 1965లోనే సైంటిస్ట్, నోబెల్ గ్రహీత హెర్బర్ట్ సైమన్ చెప్పారు. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. మనిషి మనుగడ ఇప్పటికే సౌకర్యవంతం కాగా ఏఐతో ఇది మరింత సులభతరం అవుతుంది. ఇంకా చెప్పాలంటే సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడిలా.. కృత్రిమ మేధా సంపత్తి మానవుడికి సవాలు విసురుతున్నది. 

కాగా, తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రయోగాల  పుట్టగా పేరుంది. చంద్రబాబు ఆధ్వర్యంలో నడిచే ఈ పార్టీ కార్యక్రమాలలో   టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంటుంది. హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణానికి పునాది వేసిన ఘనుడు  చంద్రబాబేనని తెలంగాణ ఈనాటి పాలకులు కూడా తడుముకోకుండా చెప్తున్న సంగతి తెలిసిందే.  పార్టీ విషయానికి వస్తే 90ల్లోనే పార్టీ సభ్యులు, కార్యకర్తల వివరాలను కంపుటరైజేషన్ చేసిన చరిత్ర టీడీపీది. దేశ రాజకీయ చరిత్రలో అదే ప్రథమం. ఇలా టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు, టీడీపీ ఎప్పుడూ  ముందుంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియా ఈ రోజు గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రేపటి గురించి ఆలోచిస్తారని ఆ పార్టీ కార్యకర్తలు తమ నాయకుడి గొప్పతనం గురించి చెప్పుకుంటుంటారు. అలాగే ప్రయోగం చేస్తే పోయేదేముంది సక్సెస్ అయితే అదే చరిత్ర అంటూ టీడీపీ మరో ప్రయోగం చేపట్టింది. 

యాంకర్ లేకుండానే యాంకర్ తో యువగళం వార్తలు చదివించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ సాయంతో యువగళంలో వార్తలు చదివే యాంకర్‌ను రూపొందించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్ తో వార్తలు చదివేలా టీడీపీ సాఫ్ట్ వేర్  డిజైన్ చేసింది. ఆ యాంకర్ కు వైభవి అని పేరు కూడా పెట్టారు. ఈ ప్రయోగం ద్వారా యాంకర్.. లోకేశ్ చేపట్టిన యువగళం షెడ్యూల్ ను వివరించింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 159వ రోజు జరిగే కార్యక్రమాలను కృత్రిమ యాంకర్ వైభవి వార్తలా చదివింది.  కనిగిరిలో పాదయాత్ర షెడ్యూల్‌ వివరాల్ని వైభవి అందరికి తెలియజేశారు. ఈ వీడియో దాదాపు 1.40 నిమిషాలు పాటు ఉండగా ఈ వీడియోలో పాదయాత్ర సాగే గ్రామాలు, కార్యక్రమాల వివరాలు ఉన్నాయి. ఇక నుంచి యువగళం అప్డేట్స్ ఇచ్చేలా కృత్రిమ యాంకర్ వైభవిని సిద్ధం చేసి ప్రయోగించారు. 

టీడీపీ రాబోయే రోజుల్లో ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మేనిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు, అప్డేట్స్ ప్రజల్లోకి ఇలాగే పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల చరిత్రలో తొలి ఎఐ యాంకర్ కాన్సెప్ట్ తమదేనని టీడీపీ అంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందంజలో ఉండే టీడీపీ దీంతో ఏఐ టెక్నాలజీలో కూడా ఓ అడుగు ముందుకేసినట్లయింది. కాగా, ఆర్టిఫీషియల్ యాంకర్ స్పష్టంగా తెలుగు చదవడంతో నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడున్న న్యూస్ యాంకర్స్ కొందరు తెలుగును చంపేస్తుంటే ఆర్టిఫీషియల్ యాంకర్ వైభవి స్పష్టంగా వార్తలు ప్రజెంట్ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందులో మరికాస్త డెవలప్మెంట్ కావాల్సి ఉండగా ముందుముందు ఆ లోటుపాట్లు కూడా లేకుండా చేస్తామని టీడీపీ టెక్ విభాగం చెప్తుంది.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.