బాబు–పవన్ బంధమే వైసీపీకి బ్రేకా..సర్వేలో సంచలన సంకేతాలు..!

Publish Date:Jul 3, 2026

Advertisement

 

సొంత సర్వేతోనే జగన్‌కు షాక్?.. ‘మావిగన్’ వ్యూహంపై పార్టీలో అసంతృప్తి..?

నెల్లూరు కాంట్రాక్టర్ కార్యాలయంలో వైసీపీ సర్వే బృందం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు "మావిగన్" నినాదం ఉపయోగపడుతుందంటూ తెలంగాణకు చెందిన ఓ మేధావి సూచించారనే ప్రచారం కూడా సాగుతోంది. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహం ఫలితం ఏమిటో అర్థంకాక పలువురు నేతలు తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. "మావిగన్" అనే నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతినే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో మరోసారి రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.

పార్టీ తరఫున సర్వేలు నిర్వహించే బాధ్యతను ఇద్దరు మాజీ అధికారులకు అప్పగించినట్లు సమాచారం. వీరు తరచూ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి–మైండ్‌స్పేస్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆ కార్యాలయంలోనే సర్వే బృందానికి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది.

గతంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ సర్వేల వ్యవహారాన్ని పర్యవేక్షించేవారని, అయితే ఆ సర్వేలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ బాధ్యతను నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్–రాజకీయ నాయకుడికి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వే ఫలితాలు పార్టీ అధినేతను తీవ్ర నిరాశకు గురిచేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ సమన్వయం బలంగా కొనసాగుతున్నంతకాలం వైసీపీకి అధికార అవకాశాలు పరిమితంగానే ఉంటాయని సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే కొత్త రాజకీయ నినాదాలు, వ్యూహాలపై పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

జమీన్ రైతు పత్రిక ప్రత్యేక కథనం..!

By
en-us Political News

  
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.