వైఎస్సార్ ఫొటో ఫేడవుట్ అవుతోందా?

Publish Date:Feb 4, 2022

Advertisement

చీమా చీమా ఏం కావాలి నీకు అంటే.. పిసరంత పవర్ కావాలి దేవుడా అని కోరుకుందట. చిరుప్రాణులైన చీమలకే పవర్ మీద అంత మోజున్నప్పుడు.. ఆరడుగుల మనుషులకు మాత్రం ఎందుకుండదు? అయితే పవర్ ఉపయోగించి మనుషుల్ని కుట్టిన చీమలు.. వాటి జీవితంలో బాగుపడినట్టు చరిత్రలో లేదు. కుట్టినచోటే కుక్కిన పేనుల్లా చచ్చూరుకుంటాయి కాబట్టి. ఎందుకంటే అవి కుట్టిన వెంటనే మనుషుల్లోని మెదడు 'అసంకల్పిత ప్రతీకార చర్య 'కు ఉపక్రమించి... ఆ చీమలు కుట్టిన చోట చేత్తో ఒక్క దెబ్బ వేసేలా చేసి నలిపేస్తుంది. 

ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. పవర్ ను దుర్వినియోగం చేస్తే చీమలైనా, పాములైనా నేల కరవక తప్పదు. ఇది శాశ్వతమైన ప్రాపంచిక సత్యం. అయితే అలాంటి పవర్ కోసం ఏపీ సీఎం జగన్... తాను సీఎం కాకముందు ఎన్ని కలలు కన్నారో, ఎందరిని ఆశ్రయించారో, ఎందరి సలహాలు తీసుకున్నారో తెలుగు ప్రజలకు తెలియంది కాదు. ఆ పవర్ కోసమే తండ్రిగారైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ఇప్పటికీ సాక్షి చానల్ మీద లోగోలో సైతం మిక్స్, పుష్పాభిషేకం చేయిస్తూ తన ప్రేమను ప్రపంచానికి చాటుకుంటున్నారు. తండ్రి సంపాదించిన మహానేత అనే పేరు ప్రఖ్యాతులు తన రాజకీయ భవితవ్యానికి ట్రాన్స్ ఫర్ అయ్యేందుకు, ఆ మహానేత వారసుణ్ని అని ప్రజల్ని నమ్మించేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. 2009లో వైఎస్ చనిపోయిన వెంటనే ఆయన ఫొటోలు, ఆయన పథకాలు, ప్రజలతో మమేకమైన ఆయన సర్వస్వాన్నీ తనకు సంక్రమింపజేసుకున్నారు.. జగన్. వైఎస్సార్సీపీ అంటూ తండ్రి పేరుతోనే పార్టీని కూడా స్థాపించుకున్నారు. ప్రజల ముంగిట నిలబడ్డారు. పాదయాత్రలు చేశారు. రైతుదీక్షలు చేశారు. ఓదార్పు యాత్రలు చేశారు. కాసింత పవర్ కావాలంటూ ప్రార్థించారు. ప్రాధేయపడ్డారు. తలలు నిమిరారు.  అమ్మలు, అక్కలు, తల్లుల కడుపుల్లో తల పెట్టి, చేతులు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని ఓట్లడిగారు. ఆఖరుకి సక్సెస్సయ్యారు. తనక్కావాల్సిన పవర్ ను సాధించుకున్నారు. 

అయితే పవర్ కోసం ఇన్ని సర్కస్ ఫీట్లు చేసిన జగన్, తను సాధించుకున్న పవర్ లో ఇతరుల పాత్ర, ముఖ్యంగా జన్మనిచ్చిన తండ్రి పాత్ర కూడా లేకుండా చేసుకోవాలన్న ఆరాటం కలిగినట్లుంది అంటున్నారు ఏపీ రాజకీయ పరిశీలకులు. తొలుత పార్టీ లోగోలో వైఎస్ బొమ్మ మాత్రమే ఉండేది. అయితే పార్టీ లోగో నుంచి నిదానంగా తండ్రి ఫొటో లేకుండా చేయాలనిపించిందో ఏమో తెలీదు కానీ... కొంతకాలం తర్వాత ఆ లోగో మధ్యలో, ప్రభుత్వ పథకాల్లో తండ్రి ఫొటో పక్కన జగన్ బాబు ఫొటో వచ్చి చేరిపోతోంది. కొన్ని సందర్భాల్లో అయితే వైఎస్సార్ బొమ్మ అదృశ్యమైపోయి కేవలం జగన్ ఫొటో మాత్రమే దర్శనమిస్తోంది. పార్టీ సింబల్ గా పాతదే ఉన్నా.. జనంలో మాత్రం ఇప్పుడు జగన్ సింగిల్ ఫొటో ఉన్న లోగో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ లో ఈ వైఖరి ఎందుకొచ్చిందో సులభంగానే అర్థం చేసుకోవచ్చని ఏపీ ప్రజానీకం, రాజకీయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని కలలు కంటున్న జగన్... ఇకపై తండ్రి ఫొటోను ప్రజల మస్తిష్కాల్లోంచి ఫేడవుట్ చేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు. పవర్ సంపాదించుకున్నాక అసలా పవర్ జనరేటర్ నే మూలకు పడేయడం ప్రజల్లో నెగెటివిటీకి కారణమవుతుందని, ఇప్పటికే ప్రజాశ్రేణుల్లో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్... తన సొంత ఇమేజ్ ని సైతం కోల్పోయే తొందరపాటు చర్యలకు దిగుతున్నాడని, అది తనకే నష్టం కలిగిస్తుందనీ అంటున్నారు. మరి జగన్ కు ఏపీలో ఎలాగూ పవర్ వచ్చింది కాబట్టి.. ఏపీలో వైఎస్సార్ బొమ్మ తీసేసి... ఇటు తెలంగాణలో చెల్లెలి పార్టీ (తెలంగాణ వైసీపీ) కి వైఎస్సార్ బొమ్మ పెట్టుకునే అవగాహన ఏమైనా కుదుర్చుకున్నారా అంటూ అనుమానిస్తున్నారు తెలుగు ప్రజలు. మరి ఇలా ఈ పవర్ కోసం పాకులాటలు... ఏపీలో ఎటు దారి తీస్తోయో, తెలంగాణలో ఎటువైపు మళ్లుతాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు రాజకీయ నిపుణులు. సో.. దాని మీద క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందేనేమో. 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.