Publish Date:Apr 25, 2025
మూఢ నమ్మకం ఓ చిన్నారి ఉసురు తీసింది. 11 ఏళ్ల బాలిక పూర్ణ చంద్రిక సొంత అమ్మ, అమ్మమ్మల మూఢ నమ్మకానికి బలైంది. ఈ సంఘటన విశాఖపట్నంలో గురువారం (ఏప్రిల్ 24) చోటు చేసుకుంది.
Publish Date:Apr 25, 2025
కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్ధులను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, తమ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఆదేశించారు. ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన వారిని త్వరగా వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Publish Date:Apr 25, 2025
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచానట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో చైర్మన్ గా గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. అనంతరం 2003 నుంచి 2009 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అలాగే మోదీ సర్కార్ రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను తయారు చేసిన కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షత వహించారు.
Publish Date:Apr 25, 2025
లిక్కర్ స్కామ్ దృష్టి మళ్లించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. త్వరల్లో మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల అవినీతి అంతా త్వరలోనే బయటపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఉత్సాహం చూపుతున్నారని, 9 నెలల్లో రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ హయాంలో 21 సూట్ కేసు కంపెనీలు వచ్చాయని ఎద్దేవా చేశారు.
Publish Date:Apr 25, 2025
పహల్గాం ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల తరువాత ప్రధానమంత్రి (గురువారం (ఏప్రిల్ 24) తొలిసారిగా స్పందించారు. ఉగ్రదాడి నేపధ్యంలో విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని బుధవారమే(ఏప్రిల్23) స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోడీ గురువారం (ఏప్రిల్ 24) వరకూ వ్యూహాత్మక మౌనం పాటించారు. మరో వంక కాగల కార్యం, కానిచ్చేవారు కానిచ్చారు.
Publish Date:Apr 25, 2025
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం సంఘటనలో కుట్ర అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది.
Publish Date:Apr 25, 2025
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు. గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు.
Publish Date:Apr 25, 2025
కొన్ని శతాబ్దాల కిందట అంటే, ఐస్ ఏజ్ కాలం నాటి సంగతి. అప్పట్లో ఖండాలు ఒక్కోసారి విడిపోయి.. సముద్ర జలాలపై ప్రయాణిస్తూ.. వివిధ రకాల ప్రాంతాల్లో సెటిలయ్యేవని అంటుంది మన పురాతన భౌగోళిక చరిత్ర. అలా ఒక ఆఫ్రికా ఖండం నీటిపై ప్రయాణిస్తూ వచ్చి ఏషియా ఖండాన్ని ఢీ కొట్టిందనీ.. అలా మనకు హిమాలయా పర్వతాలు ఏర్పడ్డాయని అంటారు.
Publish Date:Apr 25, 2025
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం అధిష్టానం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది. పార్టీలో చంద్రబాబు సహచరుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
Publish Date:Apr 25, 2025
ఏపీసీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైందా? ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ అంజనేయులు అరెస్టైన రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ పోలీసు అధికారి అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఎవరైనా సరే ఔననే సమాధానమిస్తారు. ముంబై నటి కాదంబరి జత్మలానీపై అక్రమంగా కేసు నమోదు చేసి ముంబై నుంచి విజయవాడ తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించిన కేసులో పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ఇప్పుడు జగన్ హయాంలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ గా తన పరిమితులను మీరి, ఇష్టారీతిగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైంది.
Publish Date:Apr 25, 2025
జమ్మూ కశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు సాగించిన మారణకాండ మామూలు విషాదం కాదు. మాటలకందని మహా విషాదం. ముష్కర మూకలు సాగించిన రాక్షస కృత్యం. అవును. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తిన మహా విషాదం. ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన రాక్షస కృత్యం. బార్య కళ్ళెదుట భర్తను, పిల్లల కళ్ళెదుట తండ్రిని, తల్లి కళ్ళెదుట ఎదిగొచ్చిన కొడుకును తూటాలకు బలిచేసిన మహా ఘాతుకం.
Publish Date:Apr 25, 2025
పాక్ భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోందన్నడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి.
Publish Date:Apr 24, 2025
ప్రధాని నరేంద్ర మోదీ జీ అమరావతి పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అమరాతి పనుల పున: ప్రారంభోత్సవానికి మే 2వ రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.