శంకరరావు తొలగింపును ఖండించిన టీడీపీ
Publish Date:Jan 20, 2012
Advertisement
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టినప్పుడు శంకర రావుకు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సహచర మంత్రుల అవినీతిపై పోరాటం చేస్తున్నప్పుడు మాత్రం బర్తరఫ్ చేయడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగు ఓడిపోతామని తెలిసిన మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అవినీతిపై పోరాటం చేస్తున్న శంకరరావు తొలగింపు శోచనీయమన్నారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కొత్త బిచ్చగాడని ధ్వజమెత్తారు. శంకర రావు తొలగింపుపై ఆ పార్టీ నేత దేవేందర్ గౌడ్ కూడా మండిపడ్డారు. ఆయన్ను తప్పించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అవినీతిపరులపై వేటు వేయకుండా అవినీతిపరులను వేలెత్తి చూపుతున్న వారిపై వేటు వేయడం దురదృష్టకరమన్నారు.
http://www.teluguone.com/news/content/ysr-congress-24-11064.html





