రైతు సంక్షేమమే లక్ష్యంగా జీవిస్తా చంద్రబాబు
Publish Date:Jan 20, 2012
Advertisement
చిత్తూరు: తన చివరి రక్తపు బొట్టు వరకు రైతుల కోసం శ్రమిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తున్న రైతు పోరుబాటలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను వ్యవసాయం దండగని అని ఎన్నడూ అనలేదన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ అన్నారు. అయితే కాంగ్రెస్ నేతలు తనపై విష ప్రచారాలకు తెగబడ్డారని, అందులో భాగంగానే వ్యవసాయం దండగని తాను అనని మాటను అన్నట్టుగా కాళ్లకు గంటలు కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎక్కడ అన్నానో నిరూపించాలని సవాల్ విసిరితే కాంగ్రెస్ నేతలు పారిపోయారని ధ్వజమెత్తారు. తన శరీరంలో చివరి రక్తపుబొట్టు వరకూ రైతు సంక్షేమమే లక్ష్యంగా జీవిస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ఉద్వేగంగా అన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/chittore-24-11061.html





