వైసీపీలో వైఎస్సార్ బ్రాండ్ మాయం!

Publish Date:Jul 9, 2023

Advertisement

దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి అసలైన వారసులు ఎవరంటే కుమారుడు వైఎస్ జగన్ తో పాటు కుమార్తె షర్మిల కూడా నేనున్నా అని చెప్పుకుంటున్నారు. అయితే, అసలైన వారసుడిగా జగన్ కు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. ఆయన చేసిన కొన్ని సంక్షేమ పనులే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు తెచ్చి పెట్టాయి. వైఎస్ఆర్ పాలనపై నమ్మకం కుదిరిన వారే జగన్ కోరిన ఒక్క ఛాన్స్ నినాదానికి పడిపోయారు. ఏది ఏదైతేనేం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే అది వైఎస్ఆర్ కుమారుడిగానే. అందుకే వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన ప్రతి పథకానికి, కట్టే ప్రతి నిర్మాణానికి ఆయన పేరు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడెప్పుడో కట్టిన వాటికి సైతం పేర్లు మార్చి మరీ వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.

ఇక, ఈ నాలుగేళ్ళలో ఎప్పుడు వైఎస్ఆర్ కి సంబంధించి జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పల్లె స్థాయి కార్యకర్త నుండి సాక్షాత్తు సీఎం వరకు ఈ వేడుకలను ప్రత్యేకంగా భావించేవారు. ఇంకా చెప్పాలంటే రాయలసీమలో ఈ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించేవారు. ఇడుపులపాయను సుందరంగా అలంకరించి తమ నేతకు ఘన నివాళి అర్పించేవారు. కానీ, తాజాగా జులై 8న వచ్చిన వైఎస్ఆర్ జయంతిలో ఎక్కడా గతంలో స్థాయిలో జోష్ కనిపించలేదు. సాక్షాత్తూ ఆయన కుమారుడు, సీఎం జగన్మోహన్ రెడ్డే త‌న తండ్రి ఘాట్‌కు వెళ్లి పూలుచల్లి నివాళి అర్పించి అటు నుండి అటు పులివెందుల‌ ప‌ర్య‌టనకి వెళ్లిపోయారు.

రాష్ట్రవ్యాప్తంగా కూడా 150 మంది ఎమ్మెల్యేలలో పట్టుమని పది మంది కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించలేదు. రాయలసీమలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చిన్నా చితకా సేవా కార్యక్రమాలు నిర్వహించగా   రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎక్కడా ఆ స్థాయి కార్యక్రమాలు కూడా లేవు. గ్రామాలలో అంతకు ముందు మూడేళ్లు కేక్ కటింగ్, స్వీట్లు పంచడం, అన్నదానాలు, రక్తదానాలు నిర్వహించగా ఈసారి దాదాపుగా ఆ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైసీపీలో వైఎస్ఆర్ మ్యానియా ఏమైందని సహజంగానే అనుమానాలు మొదలవుతున్నాయి. వైసీపీ నేతలు, పెద్దలు కావాలనే ఈసారి వైఎస్ఆర్ జయంతిని పక్కన పెట్టారా? లేక అధిష్టానం చెప్పినా ఆ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారా? అనే చర్చ ఆ పార్టీ శ్రేణులలోనే మొదలైంది.

కారణం ఏంటన్నది తెలియదు కానీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సైతం వైఎస్ఆర్ పేరు ప్రస్తావనకు తీసుకురావడం లేదు. అంతకు ముందు ప్రతి పథకానికి తన తండ్రి పేరు పెట్టుకున్న సీఎం ఇప్పుడు తెచ్చే పథకాలకు జగనన్న పేరు వచ్చేలా చూసుకుంటున్నారు., పట్టాల పంపిణీ నుండి పలు సంక్షేమ పథకాల వరకూ ఇప్పుడు జగన్ పేరే కనిపిస్తుంది.. వినిపిస్తున్నది. బహుశా తండ్రి లెగసీతో అధికారంలోకి వచ్చినా ఇప్పుడు తన సొంత ఇమేజ్ ప్రజలపై ఉండేలా చూడాలనే ఇలా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడూ అదే క్రమంలోనే వైఎస్ఆర్ కి సంబంధించిన కార్యక్రమాలను కూడా సోసోగానే చూస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇలాంటి వేడుకలను ఘనంగా నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. అయినా ఈసారి వైసిపీ ఆ పని చేయలేదు.

 ఒకవైపు అధిష్టానం ఈ వేడుకలపై ఫోకస్ పెట్టకపోగా.. ఆ పార్టీలో ఇతర సమస్యల కారణంగా నేతలు కూడా మొహం చాటేసినట్లు కనిపిస్తుంది. వైసీపీలో అంతర్గత కుమ్ములాట‌లు, ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేక లైట్ తీసుకున్న వాళ్ళు కొందరు, తనకు ఈసారి టికెట్ వస్తుందనే ఆశలేని నేతలు కొందరు.. ఇలా ఎవ‌రికివారే మౌనంగా ఉండిపోయారు. దీనికి తోడు మొన్నటి వరకు కంచుకోటగా ఉన్న నెల్లూరు లాంటి జిల్లాలలో ఇప్పుడు ఆ కోటలు బద్దలైపోవడం.. ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా అసంతృప్తితో ఉండడం లాంటి కారణాలు కూడా  వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మమ అనిపించేయడానికి కారణంగా చెబుతున్నారు.  అయితే, అసలే ఎన్నికల సమయం కనుక కనీసం అధిష్టానం అయినా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉన్నా లైట్ తీసుకోవడం చూస్తుంటే దీని వెనక వాళ్ళ ఆలోచన మరేదైనా ఉందేమో అనుకోవాల్సి వస్తుంది.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.