నేతాజీ నుంచి వివేకా దాకా.. ఎన్నో మిస్టరీ మరణాలు!

Publish Date:Nov 16, 2021

Advertisement

చరిత్రలోనే కాదు వ్యక్తుల జేవితాలలోనూ చీకటి కోణాలుంటాయి. అలాగే, కొన్ని చావులు మిస్టరీగా మిగిలి పోతుంటాయి. చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్  ఎప్పుడు ఎక్కడ ఎలా చని-పోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే  మిగిలి పోయింది. 1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఏమిటన్నది ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది. 

దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఉన్నత కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ మెట్టినింట కాలు పెట్టిన తర్వాత కొంత కాలానికి  ... ఆ కుటుంబంలో  వరసగా అనుమానస్పద మరణాలు సంభవిచాయని అక్కడా, ఇక్కడా వార్తలు వచ్చాయి. అయితే, దశాబ్దాలు గడుస్తున్నా ఈ అనుమానాస్పద  మరణాలకు సంబందించిన నిజానిజాలు ఏమిటన్నది మటుకు ఇంతవరకు ప్రపంచానికి తేలియదు. 

ప్రముఖ రాజకీయ కుటుంబానికి అల్లునిగా వచ్చిన వ్యాపారవేత్త (అప్పుడు ఆయన ఓ మాములు వ్యాపారవేత్త, ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి)  సోదరి, 2001లో అనుమానాస్పద పరిస్థితుల్లో కారు ప్రమాదంలో చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు, హత్య అన్న ఆరోపణలు వచ్చినా, ఆ తర్వాత కథ ఏ కంచికి  చేరిందో, ఏమైందో ప్రపంచానికి తెలియదు. 
ఆతర్వాత రెండేళ్లకు పెద్దింటి అల్లుని సోదరుడు 2003 అనుమానస్పద స్థితిలో హోటల్ గదిలో చనిపోయారు. చివరకు అల్లుదు గారి తండ్రి 2009లో అదే రీతిలో హోటల్ గదిలో అలాగే, అనుమానస్పద స్థితిలోనే చనిపోయారు.  అయితే  ఇవి .. హత్యలా.. ఆత్మ హత్యలా .. సహజ మరణాలా అన్నది ఇంతవరకు ప్రపంచానికి తెలియదు, ఇక ముందు తెలిసే అవకాశం కూడా లేక పోవచ్చును. 

అక్కడి నుంచి, అవిభక్త ఆంద్ర ప్రదేశ్ కు వస్తే  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయి. ఎవరో కాదు వైఎస్ కుటుంబ సభ్యులే పలు సందర్భాలలో, వైఎస్ మంరణం పట్ల అనుమానాలు వ్యక్త పరిచారు. వైఎస్’ను హత్యచేశారని  ఆరోపించారు. ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త వైపు వేలెత్తి కూడా చూపారు. అయితే, ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ, దివంగత నేత పేరు చెప్పుకుని, అధికారంలోకి వచ్చిన ఆయన కుమారుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే వ్యాపారవేత్తతో రాజకీయ వియ్యం కలుపుకున్నారు. సో .. వైఎస్ మరణం కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. నిజానిజాలు ఎలా ఉన్నా, పరిటాల హత్య, కోడెల శివప్రసాద రావు ‘అత్మహత్యల’ విషయంలోనూ ఇప్పటికీ ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి. 

అవన్నీ ఒకెత్తు అయితే, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య మిస్టరీ మర్డర్స్ అన్నిటిలోకీ మరింత మిస్టరీగా   మలుపులు తిరుగుతోంది. వైఎస్ మరణం విషయంలో ఆయన సతీమణి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఎలాగైతే అనుమానాలు వ్యక్త పరిచారో .. వివేకా కుటుంబ సభ్యులు కూడా ఆయన మరణం విషయంలో అనుమానాలు వ్యక్త పరిచారు. వివేకా చనిపోయిన రోజున ఆయన కుటుంబ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి తమ పదనాన్న మృతి పట్ల తమకు అనుమానాలున్నాయని, విచారణ జరపాలని  మీడియా ముందు డిమాండ్ చేశారు. 
ఆ రోజున పులివెందుల ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి  ‘మా కుటుంబ పెద్ద దిక్కు, పెద్దనాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయనది సహజ మరణం కాదు. పెద్దనాన్న మరణం పట్ల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన తలపై రెండు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయి. చేతి, మొహంపై కూడా గాయాలు కనబడుతున్నాయి. మాకున్న అనుమానాలను నివృత్తి చేయాల’ని కోరారు. చిత్రం ఏమిటంటే, ఇప్పడు ఆ అవినాష్ రెడ్డి పైనే, అనుమానాలు వ్యక్త మావుతున్నాయి. ఆ రోజున ఆయన ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో ధాంటే’ అన్నట్లుగా అనుమానాలు, ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనకున్న శంకర్‌రెడ్డి.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డిల ప్రస్తావన ఉందని పట్టాభి చెప్పారు. 

వివేకా హత్య జరిగిన రోజు సంఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలు తారుమారు చేసి గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలే అని ఆరోపించారు. సిట్‌ను రెండుసార్లు మార్చి సీఎం జగన్‌ నీరుగార్చే ప్రయత్నం చేశారని పట్టాభి ఆరోపణలు చేశారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో పాటు జగన్‌ కూడా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు.రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, వివేకా మర్డర్ మిస్టరీ ఎప్పటికైనా విడి పోతుందా .. దోషులకు శిక్ష పడుతుందా ... ఈ బేతాళ ప్రశ్నకు బదులేది ..
 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.