వైఎస్ వివేకా హంతకులెవరు? ఆచూకీ చెబితే 5 లక్షల నజరానా..

Publish Date:Aug 21, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. రెండున్నర నెలలుగా కడపలోనే మకాం వేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను విచారిస్తున్న సీబీఐ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది.సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు  డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు  శుక్రవారం ఒకరిని విచారించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పటికే ఇతడిని పలుమార్లు విచారించారు. శనివారం కూడా మరికొందరిని విచారణకు పిలిచారు.  వైఎస్సార్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సీసీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని మొదటిసారిగా విచారణకు పిలిపించారు. మరోవైపు వైఎస్ వివేకా కుమార్తె సునీత సీబీఐ అధికారుల్ని కలిశారు.. దాదాపు 4 గంటలకుపైగా వారితో భేటీ అయ్యారు.

2019 మార్చి 15 అర్థరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ కేసులో ఏపీ పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేపట్టింది. వివేకా కుమార్తే అభ్యర్థనతో హైకోర్టు ఉత్తర్వులతో ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయింది. 2020 జూన్ 9న ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కరోనా కారణంగా కొన్నాళ్లు ఏపీకి నేరుగా వచ్చి విచారణ చేపట్టలేదు. ఇటీవల ఏపీకి వచ్చి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సునీల్ కుమార్ యాదవ్ అనే పేరు మాత్రమే ఈ కేసులో ప్రముఖంగా వినిపించింది. అతడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం గాలించారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. 
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన  రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్‌ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
 బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.