విజయమ్మ సమావేశం వెనుక ఆయనదే కీ రోల్? హాజరుకానున్న ఏపీ మంత్రి?
Publish Date:Sep 1, 2021
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి విజయ్మమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆమె ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంస్మరణ సభపైనే అందరి కన్ను పడింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ విజయమ్మ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 3 వందల మందికి విజయమ్మ నుంచి ఆహ్వానాలు వెళ్లాయని తెలుస్తోంది. గతంలో వైఎస్సార్ కలిసి పని చేసిన నేతలు, అధికారులు, జర్నలిస్టులు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో మంత్రులుగా ఉన్నవాళ్లకు కూడా ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. దీంతో విజయమ్మ సమావేశానికి ఎవరెవరు వెళతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇక విజయమ్మ నిర్వహిస్తున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లన్ని ఒక వ్యక్తి పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలుస్తోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం పేషీలో అడిషనల్ పీఎస్ గా వ్యవహరించిన శర్మే ఏర్పాట్లు చూస్తున్నారని చెబుతున్నారు. గతంలో వైఎస్ కార్యక్రమాలకు ఆయనే కర్త.. కర్మ.. క్రియ అనేవారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నవారిలో శర్మ.. సూరీడు.. చారి.. ప్రభాకర్ రెడ్డి.. జన్నత్ హుస్సేన్.. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యులు. వైఎస్ పాల్గొనే ప్రతి కార్యక్రమం శర్మే ఫైనల్ చేసే వారని చెబుతారు. వైఎస్సార్ మరణం తర్వాత కూడా ఆయన కుటుంబంతో కలిసి ఉన్న అతి కొద్దిమందిలో శర్మ ఒకరు. అందుకే సమావేశ బాధ్యతలను శర్మకు విజయమ్మ అప్పగించారని తెలుస్తోంది. వైఎస్సార్ సంస్మరణ సభను సక్సెస్ చేసేందుకు శర్మ తన పాత పరిచయాల్ని తిరగదోడుతున్నారని చెబుతున్నారు. సమావేశానికి ఎవరెవరిని పిలవాలి? వారికి సంబంధించిన వివరాలు.. కాంటాక్టులు అన్ని కూడా శర్మనే సేకరించినట్లు చెబుతున్నారు, కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఎవరితో నేరుగా ఫోన్లో మాట్లాడాలి? ఎవరికి మెసేజ్ లు పంపాలి? ఇలాంటివన్నివిషయాలు శర్మనే దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా విజయమ్మ ఆత్మీయ సమావేశంలో శర్మ కీలకభూమిక పోషిస్తున్నారని అంటున్నారు, విజయమ్మ సమావేశానికి అప్పటి కేబినెట్ మంత్రులే కాకుండా గతంలో స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఉమ్మడి శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, సినీ హీరో నాగార్జున, దర్శకులు పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ తదితరులకు ఆహ్వానాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీకే బృందంలోని శిష్యురాలు షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది.
http://www.teluguone.com/news/content/ys-vijayamma-meeting-key-person-sharma-39-122368.html





