లోక్‌సభ్ స్పీకర్‌కు సునీత‌ లేఖ.. అవినాశ్‌రెడ్డి అరెస్ట్ త‌ప్ప‌దా?

Publish Date:Feb 28, 2022

Advertisement

వివేకా కూతురు సునీత ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు. జ‌గ‌న‌న్న‌ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా, కుటుంబ స‌భ్యులే కుట్ర చేసినా.. ఒంట‌రిగా పోరాడుతున్నారు. ఇప్ప‌టికే హైకోర్టులో ఆశ్ర‌యించి సీబీఐ ఎంక్వైరీ జ‌రిగేలా చేసిన సునీత‌.. ఇప్పుడు కేసులో కుట్ర‌దారుల భ‌ర‌తం ప‌ట్టేందుకు స్వ‌యంగా రంగంలోకి దిగారు. సీబీఐ ద‌ర్యాప్తులో ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్ర స్ప‌ష్టం కావ‌డంతో.. ఆయ‌న్ను అరెస్ట్ చేయించేలా త‌నవంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వివేకా కుమార్తె సునీత లేఖ రాశారు. 

తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి హస్తం ఉందని లేఖలో తెలిపారు. అవినాశ్‌ పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని లేఖకు జతపరిచారు. అలాగే సీబీఐకి నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‌కు వైఎస్ సునీత పంపించారు. దీంతో.. నేడోరేపో ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌టూ ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఇక‌, సీబీఐకి వైఎస్‌ సునీత ఇచ్చిన వాంగ్మూలంలో సంచ‌ల‌న విష‌యాలు ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను రాజకీయంగా వాడుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిపొందారని దివంగత వివేకా కుమార్తె డాక్టర్ సునీత వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ ఎదుట ఆమె 2020 జులై 7న ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఆ వాంగ్మూలంలో సునీత పలు కీలక విషయాలు వెల్లడించారు. . ‘మా నాన్నను ఎవరు చంపారో పులివెందులతో చాలా మందికి తెలుసు. హంతకులెవరో తేల్చాలని అన్నను కోరా. హంతకులు వారే అయి ఉండొచ్చంటూ అన్న (జగన్) వద్ద కొందరి పేర్లు ప్రస్తావించా. దానికి ఆయన ఇచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిం’దని సునీత అన్నారు. తాను చెప్పిన వారిని అనవసరంగా అనుమానించొద్దని జగన్ అన్నారని పేర్కొన్నారు. చివరికి తన భర్తే తన తండ్రిని చంపించి ఉండొచ్చని వారు అనడంతో తన గుండె పగిలిపోయిందని ఆమె తెలిపారు. తన తండ్రి హత్య గురించి ఫోన్ చేసి చెబితే ‘అవునా’ అంటూ జగన్, భారతి చాలా తేలిగ్గా తీసుకున్నారని సునీత చెప్పారు.

సీబీఐతో దర్యాప్తు చేయించాలని తాను కోరితే.. జగన్ బదులిస్తూ.. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే ఏమవుతుంది?.. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడని, అతడికేమీ కాదని అన్నారని సునీత సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పటికే ఉన్న 11 కేసులకు మరొకటి తోడవుతుంది తప్పితే ఒరిగేదేమీ ఉండదని జగన్ చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందని సునీత అన్నారు. అనుమానితుల జాబితాలో ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్ కుమార్రెడ్డి పేరు చేర్చడంపైనా జగన్ తనపై ఆగ్రహం వ్యక్తంచేశారని అన్నారు. సొంత చిన్నాన్న ప్రాణం కన్నా కాంపౌండరే ఆయనకు ఎక్కువ అయ్యారని సునీత పేర్కొన్నారు. తన తండ్రి చనిపోయిన విషయం తెలిసి సంబరాలు చేసుకునేందుకు బాణసంచా కొనుగోలు చేసిన వ్యక్తిని ఎలా వదిలిపెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు. 

తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివేకా కుమార్తె డాక్టర్ సునీత స్పష్టం చేశారు. తన తండ్రిపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి రాజకీయ కక్ష పెంచుకున్నారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. హత్య విషయాన్ని ముందుగా భారతికి, ఆ తర్వాత జగన్కు ఫోన్ చేసి చెబితే.. అవునా..? అంటూ చాలా తేలిగ్గా స్పందించారని, వారి మాటల్లో ఏ కొంచెమైనా బాధ కనిపించలేదని అన్నారు

‘2019 మార్చి 15న ఉదయం ఐదున్నరకు నా భర్త రాజశేఖర్ రెడ్డికి పులివెందుల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కంగారుగా మాట్లాడుతుంటే.. నేను, మా అమ్మ గమనించాం. అడగ్గానే మీ నాన్న చనిపోయారని చెప్పారు. ఉదయం ఏడున్నరకు టీవీ వార్తల్లో గుండెపోటుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నా భర్తకు ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్ చేసి, కేసు పెట్టమంటారా.. అని అడిగాడు. అదే సమయంలో మా తండ్రి సహాయకుడు ఇనయతుల్లా వాట్సాప్ నుంచి ఫొటోలు వచ్చాయి. వాటిని నా భర్తకు చూపించా. రక్తంతో పాటు తలపై గాయాలు చూస్తే అమ్మ భయపడుతుందని మాట్లాడకుండా నా భర్తకు చూపించా. కారులో కూర్చున్న మా అమ్మ ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేయమంటే.. ఎన్నిసార్లు చేసిన ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి మేం పులివెందుల వచ్చే వరకు పోస్టుమార్టం చేయొద్దని చెప్పా. మా బంధువు అభిషేక్ రెడ్డికి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాం. అయినప్పటికీ కాసేపటి తర్వాత ఫోన్ చేసి పోస్టుమార్టం పూర్తయిందని, కుట్లువేసి కుట్టేశారని చెప్పారని డాక్టర్ సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నేర ఘటనా స్థలంలో ఆధారాలను కూడా ధ్వంసం చేశారని తెలిసిందన్నారు. నాన్నకు సన్నిహితుడైన ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టించొద్దని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని అనడంతో హత్య జరిగిందని తాను నిర్ధారించుకున్నానని సునీత చెప్పారు. ‘వెంటనే సీఐ శంకరయ్యకు నా భర్త ఫోన్ చేసి కేసు నమోదు చేయమని చెప్పారు. నాన్న హత్య గురించి తెలిసినా పులివెందులలో  ఉన్న అనుమానితులు అంత్యక్రియలు ఆ రోజే అయిపోవాలని హడావుడి చేశారు. శంకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు భరత్ యాదవ్ కు ఈ హత్య గురించి మొత్తం తెలుసు’ అని సునీత చెప్పారు.

తన తండ్రి హంతకులను శిక్షించాలని.. జగనన్న‌ను.. సజ్జల, సవాంగ్ తదితరుల సమక్షంలో బతిమాలినట్టు సునీత గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అనుమానితుల జాబితాలో చేర్చడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఎంవీ కృష్ణారెడ్డి (వివేకా పీఏ) ద్వారా నీ భర్త రాజశేఖర్ రెడ్డే హత్య చేయించాడని ఎందుకు అనుకోకూడదని అనడంతో జగన్ తో వాగ్వివాదానికి దిగానని సునీత చెప్పారు. తనకు తెలిసినంత వరకు.. భరత్ యాదవ్, సునీల్ యాదవ్ తో కలిసి 104 కోట్ల రూపాయల వ్యవహారాన్ని తన తండ్రి సెటిల్ చేశారని, అందులో తన తండ్రికి 4 కోట్ల రూపాయలు వచ్చాయని అన్నారు. అందులో భరత్, సునీల్ వాటా డిమాండ్ చేస్తే కోటిన్నర రూపాయలకు ఎక్కువ ఇవ్వనని తేల్చి చెప్పారని, తన తండ్రి హత్యకు బహుశా ఇది కూడా ఓ కారణం అయి ఉంటుందని సునీత అన్నారు.

తన తండ్రి వివేకా, పెదనాన్న రాజశేఖరరెడ్డికి ఉమ్మడిగా ఉన్న 600 ఎకరాలను జగన్, షర్మిల, తనకు సమానంగా తలా 200 ఎకరాలు పంచారని, ఆ తర్వాత ఎకరం లక్ష చొప్పున తన నుంచి ఆ ఆస్తిని వెనక్కి తీసుకున్నారని సునీత చెప్పారు. అవినాష్ తో తన భర్త కుమ్మక్కయినట్టు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని, ఆస్తి మొత్తానికి తానే వారసురాలినని డాక్టర్ సునీత చెప్పారు.

‘భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి మా తండ్రి అంటే గిట్టదు. కానీ బయటికి మాత్రం స్నేహం నటించేవారు. నాన్న హత్యకు సంబంధించి రంగన్న, ఎర్ర గంగిరెడ్డి, పందింటి రాజశేఖర్, ఎంవీ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్, వెన్నపూసల రాజేష్, ఉదయ్ కుమార్ రెడ్డి, ఈసీ సురేందర్ రెడ్డి, డి. శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీఐ శంకరయ్య, రామకృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిని విచారిస్తే నిజాలు బయటికి వస్తాయి. డ్రైవర్ దస్తగిరిని మా నాన్న ఉద్యోగం నుంచి తీసేశారు. సునీల్ యాదవ్ మనిషి అని అనుమానం రావడంతో.. మా బావతో రికమెండేషన్ చేయించినా మా అమ్మ ఒప్పుకోలేదు’ అని వివేకా కుమార్తె సునీత సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారు.

‘గుండెపోటు కథను సాక్షిలో ఆ రోజు ఉదయం పదిన్నర వరకూ నడిపారు. భారతి సోదరుడు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి నాన్న చనిపోయిన సమయంలో సాక్షి మీడియా అడ్మిన్ అయిన తన భార్యతో ఫోన్ లో మాట్లాడారు. ఇతర టీవీల్లో అనుమానాస్పద మృతి అని వస్తున్నా.. ఆమె ఎందుకు గుండెపోటు కథను పదిన్నర వరకూ కొనసాగించారో’ తేలాలని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.