జగన్ పార్టీలోకి వైఎస్ వివేకా కుమార్తె.. పులివెందుల టికెట్ ఆఫర్.. జగన్ స్కెచ్!?

Publish Date:Jul 5, 2022

Advertisement

లోక్‌సభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. కొన్ని సార్లు వేగంగా.. మరికొన్ని సార్లు నెమ్మదిగా సాగుతోంది. దీంతో అసలు ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందంటే... సీబీఐ అధికారులే ఈ కేసుపై క్లియర్ కట్‌గా ఓ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనే ఓ టాక్ అయితే ఉమ్మడి కడప జిల్లాలో జోరుగా నడుస్తోంది. అయితే ఈ కేసులో దోషులు బయటపడతారని  వివేకా కుమార్తె   సునీత కళ్లల్లో ఒత్తులు వేసుకునీ మరీ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ కేసు విచారణ మాత్రం నత్తతో పోటీపడి నడుస్తోంది. మరోవైపు వివేకా హత్య కేసులో సీఎం  జగన్‌తోపాటు కడప ఎంపీ  ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా వివేకా హత్య అనంతరం పులివెందుల్లో వైయస్ ఫ్యామిలీలోని వారే వర్గాలుగా విడిపోయారని పులివెందులలో జనం చర్చించుకుంటున్నారు. దీంతో గతంలో కడప జిల్లా అనగానే వైయస్ ఫ్యామిలీ గుర్తుకు వచ్చేదని.. నేడు ఆ పరిస్థితి లేదన్న భావన ఆ జిల్లా వాసులలో వ్యక్తం అవుతోంది. 
ఈ నేపథ్యంలో సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సీజన్.. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో.... బాబాయ్ గొడ్డలి పోటును.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారని వైసీపీ శ్రేణుులు అంటున్నారు.  ప్రధాన ప్రతిపక్షం సైకిల్ పార్టీకి స్పీడుకు న్ బ్రేకులు వేసేందుకు.. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి   వివేకా కుమార్తె  సునీతను వైసీపీ అభ్యర్థిగారంగంలోని  దింపాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  
 1978 నుంచి పులివెందుల నియోజకవర్గం వైయస్ ఫ్యామిలీకి కంచుకోట అన్న సంగతి  తెలిసిందే. వైఎస్ఆర్, ఆయన తరువాత  వైయస్ విజయమ్మ, ఇప్పుడు ఆయన కుమారుడు   జగన్ ఇక్కడి నుంచి గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం  విదితమే. అయితే ఈ నియోజకవర్గాన్ని  సునీతకు కట్టబెట్టి.. ఇదే జిల్లాలోని జమ్మలమడుగు నుంచి   జగన్ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకొంటున్నారని వైసీపీ వర్గాల సమాచారం.  

సదరు నియోజకవర్గం కూడా వైయస్ ఫ్యామిలీకి కంచుకోటే. ఆ నియోజకవర్గంలో కూడా వైయస్ ఫ్యామిలీకి భారీగా అభిమానులున్నారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు చాలా బలంగా ఉన్నా.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. అదీకాక.. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి.. తొలినాళ్లలో ఇదే నియోజకవర్గంలో వైద్యునిగా పని చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే. 

మరి వైయస్ జగన్ చేస్తున్న రాజకీయంలో వైయస్ వివేకా కుమార్తె సునీత చిక్కుతారో లేక తన తండ్రి హత్యకు  కారకులైన వారిని న్యాయదేవత సాక్షిగా న్యాయస్థానంలో నిలబెట్టి.. వారికి కఠిన శిక్ష పడేలా చేసి.. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చేలా ఆమె.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా? అని కడప జిల్లా జిల్లా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.