షర్మిల, విజయసాయి.. జగన్ కు డేంజర్ బెల్స్.!

Publish Date:Sep 19, 2026

Advertisement

చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అన్న నానుడి ఇప్పుడు జగన్ కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. గతంలో తనకు అండగా నిలబడి, తన కోసం కష్టపడి పని చేసిన సన్నిహితులను దూరం చేసుకోవడం జగన్ కు ఉన్న అలవాటు. అలా జగన్ దూరం చేసుకున్న వాళ్ల జాబితాలో సొంత  తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా కొండవీటి చాంతాడంత పొడవుకు మించి ఉ:టుంది.  

ఈ నేపథ్యంలోనే..   2029లో జరగనున్నఏపీ సెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? అన్న చర్చ మొదలైంది. ఒకప్పుడు జగన్ కోసం నిలబడి, 2019 ఎన్నికలలో ఆయన విజయం కోసం నిర్విరామంగా కృషి చేసిన సొంత సోదరి షర్మిల, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు కుడి భుజం, ఎడమ భుజం కూడా తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయ సాయిలే 2029 ఎన్నికలలో జగన్ విజయానికి స్పీడ్ బ్రేకర్ లుగా నిలుస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికలలో జగన్  తనకు గట్టి పట్టున్న రాయలసీమలో ప్రతికూల ఫలితాలు రావడానికి ఆ ప్రాంతంలో జగన్ అంత కాకపోయినా, ఆయనతో సమానమైన పట్టు ఉన్న షర్మిల కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో వైసీపీకి గత ఎన్నికలలో సీట్లు గణనీయంగా తగ్గడానికి వైఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రచారమేననడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.  ఎందుకంటే వైఎస్ బిడ్డగా.. షర్మిలకు కూడా కడప ఖిల్లాపై గట్టి పట్టు ఉంది. 

ఇక ఇప్పుడు విజయసాయి సొంత పార్టీ ప్రకటన చేసిన క్షణం నుంచీ జగన్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నిజమైన సీమ పౌరుషం ఏమిటో తన పార్టీ ముందుముదు రుజువు చేస్తుందంటూ.. జగన్ ఇలాకాలో ఆయనను బలహీనుడిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  అంతే కాకుండా జగన్ క్రైస్తవుడని పేర్కొంటూ.. తాను రాజకీయ పార్టీ పెట్టి జనంలోకి వస్తున్నది రెడ్డి సామాజికవర్గం కోసం పోరాడటమేనని చెబుతున్నారు.  నిజానికి విజయసాయి రెడ్డి స్వస్థలంనెల్లూరు జిల్లా ప్రాంతమే అయినా.. వైఎస్ రాజశేఖరెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకూ ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా విజయసాయికి రాయలసీమలోనూ సత్సంబంధాలు ఉన్నాయి.

 ఈ పరిణామాలు జగన్ కు సీమపై ఇప్పటికే సడలిన పట్లు.. వచ్చే ఎన్నికల నాటికి మరింత సడలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రస్తతం జగన్ పరిస్ధితి చేయి (కాంగ్రెస్ )దగ్గరకెడితే చేతి దెబ్బ అన్నట్లుగా తయారైంది. ఇటు షర్మిల, అటు విజయసాయిరెడ్డి కూడా జగన్ కు గట్టి పట్టున్న సీమ, మరీ ముఖ్యంగా కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో  జగన్ కు కచ్చితంగా రాజకీయంగా భారీ నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

[YS Sharmila, Vijaya Sai Reddy, YS Jagan Mohan Reddy, Dangerbells,  YCP, Andhra Pradesh Politics, 2029 Elections, Telugu One]

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.