Publish Date:Apr 21, 2025
కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలో తన నివాసంలో సోమవారం (ఏప్రిల్ 21) ఉదయం కన్నుమూశారు. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషయాన్నిధృవీకరించారు.
Publish Date:Apr 21, 2025
బీజేపీకి ప్రాతినిథ్యం వహించే స్వామి.. చంద్రబాబు, పవన్.. తమ కూటమిలో భాగస్వామ్యం అన్న కనీస జ్ణానం కూడా లేకుండానే కామెంట్లు ఎందుకు చేస్తుంటారో అర్ధం కాదు.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం మాత్రమే కాకుండా.. ఆపై కేసులు కూడా వేస్తుంటారు.
Publish Date:Apr 21, 2025
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో ఈ ముగ్గురు మంత్రులూ వెళ్లారు.
Publish Date:Apr 21, 2025
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిజానికి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా, శ్యామ్ పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే తప్ప మిగిలిన ఇద్దరినీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
Publish Date:Apr 21, 2025
తిరుమలలోని శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. గోగర్భం తీర్థం వద్ద శారదాపీఠం భవనాన్ని 15 రోజులలోగా ఖాళీ చేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.
Publish Date:Apr 21, 2025
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం లాంగ్ వీకేండ్ కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అయితే సోమవారం (ఏప్రిల్ 21) తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.
Publish Date:Apr 20, 2025
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) ఆదివానం (ఏప్రిల్ 20) దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసంలోనే హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసినది ఆయన భార్యేనని పోలీసులు అనుమానిఃస్తున్నారు.
Publish Date:Apr 20, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర మంత్రి పెమ్మసాని నిలువెత్తు నిఘంటువుగా అభివర్ణించారు. .
చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఏపీ అసెంబ్లీ హాల్ లో ఆదివారం (ఏప్రిల్ 20)జరిగింది.
Publish Date:Apr 20, 2025
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Publish Date:Apr 20, 2025
Publish Date:Apr 20, 2025
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఇతర రాష్ట్రాలలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నారాయణ బృందం గుజరాత్ వెళ్లింది.
Publish Date:Apr 20, 2025
ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వైన్స్ షాపులు ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు.
Publish Date:Apr 20, 2025
సీఎం చంద్రబాబు చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. పుస్తకాలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్, సీనియర్ పాత్రికేయులు, రచయిత విక్రమ్ పూల రూపొందించారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ పేరుతో రెండు సంపుటాలు ప్రచురించారు.