జనవరిలో వైఎస్ జగన్ కొత్త పార్టీ? వైసీపీ ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏంటీ?   

Publish Date:Dec 11, 2020

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో పెను సంచలనాలు జరగబోతున్నాయా? జనవరిలో వైఎస్ జగన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? జగన్ కొత్త పార్టీ పెడితే ప్రస్తుత వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవిష్యత్ ఏంటీ? ఇదేంటీ.. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్  జగన్ మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడమేంటని అశ్చర్యపోతున్నారా... తమాషా చేస్తున్నారని భావిస్తున్నారా.. కాని ఆంధ్రప్రదేశ్ లో జనవరిలో ఎవరూ ఊహించని సంచలన పరిణామాలు జరగబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ పార్టీగా చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన కేసులో జనవరిలో కోర్టు తీర్పు రాబోతోంది. ఆ తీర్పు జగన్ కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే జరిగితే  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్టేనని చెబుతున్నారు.

 
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ  కూడా జగన్ పెట్టింది కాదు. హైదరాబాద్ కు చెందిన కొలిశెట్టి శివకుమార్ రిజిస్టర్ చేసుకున్న పార్టీ. 2011లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శివకుమార్ నుంచి ఈ పార్టీని జగన్ తీసుకున్నారు. దీని వెనక కూడా పెద్ద స్టోరీనే ఉంది. అయితే శివకుమర్ నుంచి ఎన్నో అష్టకష్టాలు పడి యువజన శ్రామిక  రైతు కాంగ్రెస్ పార్టీని తీసుకుని నడిపిస్తున్న జగన్ కు మరో కొత్త , సవాల్ లాంటి సమస్య వచ్చింది. అదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కంటే ముందే రిజిస్టర్ అయిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. శివకుమార్ కంటే ముందే  కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర అన్న వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ  రిజిస్టర్ అయి ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడే ఇప్పుడు కోర్టుకు ఎక్కారు. వైఎస్సార్ పేరు వాడుకునే అర్హత తమ పార్టీకే ఉందని ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైనే జనవరిలో తీర్పు రాబోతోంది.  
 

కర్నూల్ జిల్లాకు  చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమాని మహబూబ్ బాషానే అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. వైఎస్సార్ పై అభిమానంతో  2009 సెప్టెంబర్ లో అన్న వైఎస్సార్ పేరుతో ఆయన పార్టీని రిజిస్టర్ చేయించారు. మహబూబ్ బాషా పార్టీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పాల్వాయి వేణు అనే నాయకుడు ఉన్నారు. ఈ పార్టీనే ఇప్పుడు వైఎస్ జగన్ కు నిద్ర లేకుండా చేస్తోందని చెబుతున్నారు. 2009లో మహబూబ్ బాషా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్ చేస్తే.. 2010లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని శివకుమార్ రిజిస్టర్ చేశారు. నిజానికి వైఎస్సార్ పేరుతోనే పార్టీ పెట్టాలని వీళ్లిద్దరూ భావించారు. కాని వ్యక్తుల పేరుతో పార్టీలు ఉండకూడదన్న సీఈసీ రూల్స్ తో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అని ఒకరు.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరుతో మరొకరు పార్టీలు రిజిస్టర్ చేసుకున్నారు. 

 

అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మొదట జగన్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే మహబూబ్ బాషా కోర్టులో పిటిషన్ వేశాక వైసీపీ నేతల్లో అలజడి రేగిందని చెబుతున్నారు. ఎన్నికల సంఘం రూల్స్  ప్రకారం ఒక రాష్ట్రంలో ఒకే పేరుతో రెండు పార్టీలు ఉండటానికి వీలు లేదు. అలా ఉంటే మొదట రిజిస్టర్ అయిన పార్టీకే ఎన్నికల సంఘం గుర్తింపు వస్తుంది. గతంలో తమిళనాడులో ఇలాగే జరిగింది. డీఎంకే, అన్నాడీఎంకే విషయంలో ఇలాంటి సమస్యే వచ్చింది. అయితే అక్కడ డీఎంకే నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు కాబట్టి పెద్ద సమస్య కాలేదు. కాని ఏపీలో మాత్రం పార్టీ గుర్తింపు ముందు ఎవరికి దక్కుతుందన్నదే సమస్య. ఈ లెక్కన ముందుగా రిజిస్టర్ అయిన  అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే  కోర్టు తీర్పు రావచ్చని రాజ్యాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తే ఇప్పుడు జగన్ అధ్యక్షుడిగా ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పోతోంది. అదే జరిగితే వైసీపీ భవిష్యతే ఆగమ్య గోచరంగా తయారవుతుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దయితే ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పరిస్థితి ఏంటన్న చర్చ వస్తోంది. వారి సభ్యత్వాలు ఉంటాయా పోతాయా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది.

 

జనవరిలో రానున్న కోర్టు తీర్పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే పెద్ద ఇబ్బంది లేదు. అదే వ్యతిరేకంగా వస్తే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి పెద్ద గండమే. అందుకే ముందు జాగ్రత్తగా కొత్త పార్టీ పెట్టాలని జగన్ ప్లాన్ చేశారని చెబుతున్నారు. కొత్త పార్టీని రిజిస్టర్ చేయించి..  ఇప్పుడు నడిపిస్తున్న యువజన శ్రామిక  రైతు కాంగ్రెస్ పార్టీని అందులో విలీనం చేసే ఆలోచన జగన్ చేస్తున్నారని సమాచారం. దీనిపై పార్టీ ముఖ్య నేతలు, న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిధులతో సీఎం జగన్ సంప్రదింపులు జరుపుతున్నారని వైసీపీ వర్గాల నుంచే తెలుస్తోంది. మొత్తంగా వైఎస్సార్ అభిమాని మహబూబ్ బాషా పెట్టుకున్న అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుందని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జనవరిలో కోర్టు తీర్పు ఎలా వస్తుందో.. తర్వాత ఏం జరగబోతుందోనన్న ఆసక్తి జనాల్లోనూ పెరుగుతోంది.

- గోశాల ప్రసాద్

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.