బీజేపీ విషయంలో జగన్ ది రాజును మించిన రాజభక్తి.!

Publish Date:Jul 26, 2026

Advertisement

నరేంద్ర మోదీ  కాక్రోచ్ జనతా పార్టీఆందోళనలతో దిగి వచ్చి కేంద్ర మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్‌ చేత రాజీనామా చేయించింది.  అయితే ఈ విషయాన్ని వైసీపీ మెడీ సర్కార్ లోని జవాబుదారీ తనానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నది.  

మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడానికి సాహసించడం  లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.  ఎన్డీఏ ప్రభుత్వంలో   జవాబుదారీతనానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక  నిలువెత్తు నిదర్శనంగా జగన్   అభివర్ణించారు. బీజేపీ హార్డ్ కోర్ మద్దతుదారులు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మోడీ సర్కార్ అక్కౌంటబులిటీకీ, రాజకీయ విలువలకు  నిదర్శనంగా  చెప్పే సాహసం చేయడం లేదు. కానీ జగన్ మాత్రం మోడీ ప్రసన్నం కోసం.. హద్దులు మించి పొగడ్తలు కురిపిస్తున్నారు. 

ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామాను ఉదహరిస్తూ..  డీఎస్సీ పరీక్షకు సంబంధించిన  అవకతవకలకు నైతిక బాధ్యత వహించి, నారా లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేయడం విస్మయపరుస్తోంది.  నీట్ పేపర్ లీక్ అయింది. డీఎస్పీ విషయంలో లీకేజీ లేదు..    అవకతవకలు జరిగాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా రాజకీయపరమైనవి. . ఆ ఆరోపణలపై వైసీపీకి  హైకోర్టులో కూడా చుక్కెదురైంది. డీఎస్సీ ఫలితాలు వెలువడిన తరువాత.. మెరిట్ జాబితాలను ఆన్‌లైన్‌లో ప్రచురించారు. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సంబంధిత శాఖ ప్రజలకు వివరించింది. అవకతవకలు, అక్రమాలూ లేవని విస్పష్టంగా నిరూపించింది కూడా.  

వాస్తవానికి ఏపీ డీఎస్పసీలో అక్రమాలు అంటూ వైసీపీ చేసిన  ఆరోపణలలో వీసమెత్తు నిజమున్నా..  హైకోర్టు జోక్యం చేసుకుని ఉండేది.  నిజానికి  వైసీపీ హయాంలో  జరిగిన గ్రామ సచివాలయ పేపర్ లీక్‌లపై నోరెత్తని జగన్..    ఏపీపీఎస్‌సీ కాంట్రాక్టింగ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పరీక్షలో టాపర్లుగా ఎలా నిలిచారు? ఆన్‌లైన్‌లో మెరిట్ జాబితాను ప్రచురించకుండా  మెజారిటీ పోస్టులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎలా అప్పగించారన్న దానిపై సమాధానం చెప్పాలన్న డిమాండ్ యువత నుంచి వెల్లువెత్తుతోంది. జగన్ తీరు ఆయన విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకం చేస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

YS Jagan Mohan Reddy, Dharmendra Pradhan Resignation, Nara Lokesh, AP DSC Irregularities, TDP vs YSRCP, NEET Paper Leak Controversy

By
en-us Political News

  
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.