కేటీఆర్ ను బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్న ప్రముఖులు
Publish Date:Jul 24, 2020
Advertisement
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ను అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా " మై డియర్ బ్రదర్ తారక్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని దేవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను" అంటూ ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా విషెస్ అందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ "పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ బ్రదర్ శ్రీ కేటీఆర్.. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని చిల్కూరు బాలాజీని ప్రార్థిస్తున్నాను" శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కేటీఆర్ తో వేదిక పంచుకున్న శ్రీమంతుడు మహేశ్ బాబు "హ్యాపీ బర్త్ డే కేటీఆర్.. అందరికీ స్ఫూర్తివంతమైన మీ నాయకత్వం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని ట్విట్టర్ ద్వారా తన సందేశం పంపారు. వీరితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ట్విట్టర్ లో "పేదింటికి చిరునవ్వు.. నేతన్న కంటిచూపు.. భాగ్యనగరం బాద్షా.. ఐటీ సూటేసిన.. రాజనీతి రాకెట్టు.. అదరక బెదరక విశ్వవేదికలపై తెలంగాణ వాడిని వేడిని చాటిన ఉద్యమసేనాని.. తండ్రికి తగ్గ తనయుడు.. సిరిసిల్ల శ్రీమంతుడు.. అన్న కల్వకుంట్ల తారకరాముడికి జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.
http://www.teluguone.com/news/content/ys-jagan-birthday-wishes-to-ktr-39-101861.html





