కాంగ్రెస్‌‌పై జగన్ సీరియస్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకే మద్దతు

Publish Date:Aug 26, 2025

Advertisement

 

ఏపీలో అధికారంలో లేకపోయినా మాజీ సీఎం జగన్ జాతీయ  రాజకీయాల్లో బీజేపీతో అంటకాగలనే చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. గతంలో  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి, సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడే అదే స్ట్రాటజీ అవలంభిస్తోంది. 

ఆ క్రమంలో కాంగ్రెస్‌తో టచ్ ఉన్న పార్టీ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట. వైసీపీ 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికలు వచ్చేనాటికి అధికారంలోకి వచ్చింది. ఆ రెండు పర్యాయాలు జగన్ తనదైన లెక్కలతో బీజేపీ పెద్దలకు దాసోహమన్నట్లే వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో వైసీపీకి చావు దెబ్బతగిలింది. దివంగత వైఎస్ మరణాంతరం తనను ముఖ్యమంత్రిని చేయలేదని, తర్వాత తన ఓదార్పు యాత్రలకు అనుమతించలేదని కాంగ్రెస్‌కు దూరమై వైసీపీ పేరుతో జగన్ సొంత కుంపటి పెట్టుకుని పొలిటికల్ గేమ్ మొదలెట్టారు. 

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న వైసీపీ తిరిగి ప్రతిపక్షంలోకి రావడంతో మరోసారి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్‌లో వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు.. ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది. అవి నిర్ణయాత్మక ఓట్లు కాకపోయినా ఎన్డీఏ, ఇండియా కూటములకు అవి కీలకమే.అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనా, వైసీపీ పార్లమెంటులో చెప్పుకోదగ్గ బలాన్ని చాటుకుంది. అక్రమాస్తుల కేసుతో పాటు వివిధ కేసుల ఉచ్చు బిగుసుకుంటడంతో జగన్ మోడీ సర్కారుకి దాసోహం అంటున్నట్లే కనిపిస్తున్నారు.  

అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంభందాలు కొనసాగించిందో వైసీపీ అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్‌ కే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందని స్పష్టం చేసింది.

ఎన్డీఏ కూటమి అధికారంలో తొలి పదేళ్లు వైసీపీ పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపించి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి పలు కీలక సందర్బాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరచిన రాంనాధ్ కోవింద్ కి.. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడాఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకి,  ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ కి మద్దతిచ్చింది. 

తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.. దీంతో ఎన్డీఏ తరఫున  బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంబంధాన్ని పునరుద్దరించుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ జస్టీస్ సుదర్శనరెడ్డిని ఇండియా కూటమి అభ్యర్ధిగా ప్రకటించినా జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.... రాజ్యసభలో ఏడుగురు సభ్యుల బలమున్న వైసీపీనీ కనీసం తమకు మద్దతు తెలపకపోయినా తటస్థంగా ఉంటే చేయడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎంపీ రఘునాథరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ ఆవ్వటం ఏపీ రాజకీయాల్లో కీలకంశంగా మారింది. అది జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అగ్ర నేత జై రాం రమేష్ వైసీపీకి కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కి ఫోన్ చేసి మద్దతు కోరారు.
 
ఉప రాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఎలక్ట్రోరల్ కాలేజిలో పూర్తి మెజారిటీ ఉంది. అయితే ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసేలా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్‌కి టచ్‌లోకి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారనే టాక్ నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కో ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కేంద్రం అప్పగించింది. దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో జగన్ పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారంటున్నారు.


మరోవైపు కాంగ్రెస్‌కి చెందిన కీల‌క నాయ‌కులు న‌లుగురు వైసీపీ తో ట‌చ్‌లో ఉన్నారు. వైసీపీ ఎంపీ రఘునాథరెడ్డి ఏకంగా మ‌ల్లికార్జున ఖ‌ర్గేతోనూ స‌మావేశమ‌య్యారు. త‌న‌కు ఖ‌ర్గేతో 30 ఏళ్ల‌కుపైగా అనుబంధం ఉంద‌ని.. అందుకే క‌లిశాన‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు. దీనిపై వైసీపీ అధినేత స‌ద‌రు నేత‌ను వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నుంచి కీల‌క నాయ‌కులు డీకే శివ‌కుమార్‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతున్న చిదంబ‌రం వంటి వారి నుంచి వైసీపీకి ఫోన్లు వ‌చ్చాయ‌ని స‌మాచారం.

వచ్చే నెల 9న జ‌ర‌గ‌నున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి అభ్య‌ర్థి బి. సుద‌ర్శ‌న్ రెడ్డిని గెలిపించేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు. అయితే.. దీనికి వైసీపీ నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. ఇదిలావుంటే.. అంత‌ర్గ‌త స‌మావేశంలో కాంగ్రెస్ నేత‌ల వైఖ‌రిపై జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయ‌కుల‌ను కూడా ఆయ‌న మంద‌లించిన‌ట్టు తెలిసింది. అస‌లు వారు ఫోన్లు చేస్తే.. మీరెందుకు రిసీవ్ చేసుకున్నార‌ని.. ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.

తనపై కేసులు పెట్టిన విష‌యం.. తమ పార్టీని ఇరుకున పెట్టేలా.. ఇప్ప‌టికీ ష‌ర్మిల‌తో మాట్లాడిస్తున్న విషయం మీకు తెలియ‌దా? ఎవ‌డో మాణిక్యం ఆయ‌న కూడా మ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారని మండిపడ్డారంట. ఇలాంటి పార్టీ వారు ఫోన్లు చేస్తే.. మ‌నం ఎందుకు స్పందించాలి. ఇక‌, నుంచి ఫోన్లు కూడా తీయొద్దని సీరియ‌స్ గా చెప్పేశార‌ని.. తాడేప‌ల్లి కార్యాల‌యానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ ఒక‌రు ఆఫ్‌ ద రికార్డుగా మీడియా వారితో అన్నారంట.

ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఉన్నా.. లేకున్నా.. త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని వైసీపీ సీనియర్లు కొందరు అంటున్నారు. నేరుగా మాకు ఓటు వేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. మీరు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండండి. అదే మేం కోరుతున్నామని ఖ‌ర్గే కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీయేలో లేని పార్టీలు ఈ విష‌యంపై ఆలోచ‌న చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఏ కూటమిలో లేదు. త‌ట‌స్థంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎలాగోలా వైసీపీని తటస్థంగా ఉంచడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మ‌రి వైసీపీ మాత్రం కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతోంది. ఆ క్రమంలో బీజేపీతో అంటకాగడానికే జగన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.


 

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.