జగన్ కు సీఎం కుర్చీ అందని ద్రాక్షయేనా...?
Publish Date:Oct 30, 2017
Advertisement
ఎక్కడైనా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీపైన ప్రజలకు నమ్మకం పోయి.. వారిపై వ్యతిరేక భావంతో ఉంటారు. ఇదేం విచిత్రమో కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇందుకు రివర్స్ లో ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీపైన, పార్టీ ఆధినేత జగన్మోహన్ రెడ్డిపైన ప్రజలకు అంత నమ్మకం కుదురడం లేదు. అసలు సొంత పార్టీ నేతలకే జగన్ పై నమ్మకం లేకపోవడం... జగన్ తీరుపై అసంతృప్తిగా ఉంటుంటే.. ఇంకా ప్రజలకు ఎలా ఉంటుంది అంటారా.. అదీ నిజమే అనుకోండి. జగన్ ప్రవర్తన వల్ల ఇప్పటికే వైసీపీ కీలక నేతలు చాలా మంది అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇక నంద్యాల ఎన్నికల్లో, కాకినాడ ఎన్నికల తరువాత అయితే సొంత పార్టీ నేతలకే నమ్మకం పోయి ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే గత ఎన్నికలప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. కొద్ది పాటి ఎన్నికల తేడాతోనే ఓడిపోయింది. కానీ రాను రాను పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే దీనికి కారణం జగనే అని చెప్పొచ్చు. తన మూర్ఖత్వం... పెద్దలు చెప్పింది వినకపోవడం..నోటి దురుసు వెరసి చివరికి ఈ పరిస్థితి వచ్చింది. మరోవైపు జగన్ తనను నోటికొచ్చినట్టు మాటలు అంటున్నా చంద్రబాబు మాత్రం సైలెంట్ గా తనపని తాను చూసుకుంటూ.. రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి పక్క పార్టీలనుంచి నాయకులు తండోప తండాలుగా వచ్చి పార్టీలో చేరుతున్నారు. త్వరలోనే వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలతో పాటు కనీసం ఆరేడుగురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఓన్లీ ఔట్ గోయింగ్ తప్ప.. ఇన్ కమింగ్ లేదు అన్న చందాన.. పార్టీ నేతలు ఒక్కోక్కరూ వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు... తప్పా.. వైసీపీ లోకి ఒక్కరూ ఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇక పరిస్థితి గమనించిన జగన్.. దూకుడుగా ఉన్న అధికార టీడీపీ పార్టీని దాటుకుని ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నాడు. ఇలాగే ఉంటే తాను కలలు కంటూ వస్తున్న సీఎం కుర్చీ ఇక ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉంటుందేమో అని కంగారుపడిపోతున్నాడు. మరి ఇప్పటికైనా జగన్ తన ప్రవర్తన మార్చుకుంటాడో..? లేదో..? చూద్దాం..
http://www.teluguone.com/news/content/ys-jagan-39-78548.html





