ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో వై.ఎస్‌.భార‌తి పాత్ర‌... ఆనం

Publish Date:Aug 28, 2022

Advertisement

ఎంత దాచినా దాగ‌ని స‌త్యాలూ ఉంటాయి. పైకి ఎంత గంభీరంగా ఉన్నా చేసిన త‌ప్పులు ఏదో ఒక రూపంలో బ‌య‌ట‌ప‌డ‌కా త‌ప్ప దు. గోడ‌మీద పెద్ద నీడ ద‌గ్గ‌ర‌కి వెళితే చిన్న‌ద‌వుతుంది.  పెద్ద ప‌దవుల్లోనో, పెద్ద స్థాయిల్లోనో ఉన్నామ‌ని త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టిం చుకోర‌న్న ధైర్యంతో చేసే దుర్మార్గం బ‌య‌ట‌ప‌డ‌కా త‌ప్ప‌దు. దేశంలో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లింకులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి  వై.ఎస్‌. భార‌తి పాత్ర ఉంద‌న్న గుట్టు బ‌య‌ట‌ప‌డింది. 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో  సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి , ఎంపి విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని టిడిపి నేత ఆనం వెంకట రమణా రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  విజయసాయిరెడ్డితో ఆర్థిక సంబంధా లున్న పనాక శరత్ రెడ్డిని, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ విచారిస్తోందన్నారు. 

తన లావాదేవీల కోసమే జగన్‌ దావోస్‌ వెళ్లారు. ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్‌ స్కామ్‌ జరుగుతోంది. ఆదాన్‌ అనే డిస్టిలరీ స్థాపించి ఎంపీ విజయసాయిరెడ్డి స్కామ్‌లు చేస్తున్నారు. ఢిల్లీలో తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్‌ పునాదులు కదులుతున్నాయి. జగతి పబ్లికేషన్స్‌కు, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు ఆర్థిక సంబంధాలు న్నా యి. క్విడ్‌ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కు ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కోట్లు మళ్లించింద‌ని ఆయన ఆరోపించారు.  అదాన్ డిస్టిలరీస్ ద్వారా అక్ర మంగా సంపాదించిన రూ.5 వేల కోట్ల సొమ్ము ను ఢిల్లీ స్కామ్‌లో ఉపయోగించినట్లు చెప్పారు.

హైదరాబాదులో 19 కంపెనీలు ఒకే చిరునామాతో ఉన్నాయని వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయా కంపెనీల్లో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ డైరెక్టర్ గా ఉన్నాడని వెల్లడించారు. అవి జగన్, విజయసాయిల సూట్ కేసు కంపెనీలేనని  ఆనం ఆరోపించారు. రోహిత్ కంపెనీలో అదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. 2019లో అదాన్ డిస్టిలరీకి ఎవరు అనుమ తిచ్చారని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో రూ.2,400 కోట్ల మద్యం ఎలా అమ్మారని నిలదీశారు.

ప్రభుత్వంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు గుప్పించారు.  ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్ స్కామ్ జరుగు తోందని ఆరోపించారు. ఆదాన్ అనే డిస్టిలరీ స్థాపించి ఎంపీ విజయసాయిరెడ్డి స్కామ్లు చేస్తున్నారని విమర్శించారు. జగతి పబ్లి కేషన్స్‌కు, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు ఆర్థిక సంబం ధాలున్నాయని ఆరోపించారు. క్విడ్‌ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కు ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కోట్లు మళ్లించిందన్నారు. విజయ సాయి రెడ్డితో ఆర్థిక సంబంధాలున్న పనాక శరత్‌రెడ్డిని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారిస్తోందని తెలిపారు. తన లావాదేవీల కోసమే జగన్ దావోస్‌ వెళ్లారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో వైఎస్ భారతి విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.