ట్రంప్‌ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులను చంపేశాడు..

Publish Date:Apr 14, 2025

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని హత్య చేసి ఉక్రేయిన్ పారిపోవడానికి ప్లాన్ చేసిన యూస్ యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ట్రంప్‌ని హత్య చేయడానికి తల్లదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆ 17 ఏళ్ల యువకుడు వారినే హత్య చేయడంతో అసలు కుట్ర వెలుగు చూసింది.  తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో ఓ 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు గత నెల అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో తెలిసిన వాస్తవాలు చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆ యువకుడు.. అందుకు డబ్బులు ఇవ్వట్లేదనే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఫెడరల్‌ వారెంట్‌లో పేర్కొన్నారు. 

విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తమ నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కొన్ని వారాల పాటు మృతదేహాల పక్కనే నివసించాడు. ఆ తర్వాత 14వేల డాలర్ల నగదు, పాస్‌పోర్ట్‌ ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

అతడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత నెల కాన్సస్‌లో నిందితుడు నికిటాను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్లు తెలిసింది. అంతేకాదు.. అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు అతడు కుట్ర పన్నినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడంతోనే వారిని నిందితుడు హత్య చేసినట్లు తెలిసింది. వారిని చంపేసిన తర్వాత ఆ యువకుడు ఓ డ్రోన్‌, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడట. ఓ రష్యా వ్యక్తితో కలిసి ఈ ప్లాన్‌ వేసినట్లు సమాచారం. టిక్‌టాక్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌లలో ఇతడు సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ట్రంప్‌ను చంపి ఉక్రెయిన్‌ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

By
en-us Political News

  
మెట్రోస్టేషన్లు, రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లపై మెట్రో రైళ్లలో ప్రకటనపై పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణకు హైదరాబాద్ మెట్రో రైలు తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలు ఇప్పుడు వేయడంలేదన్న ఏజీ పేర్కొన్నారు. మెమో దాఖలు చేసినట్లు తెలిపిన ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ 5 నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని తండ్రి భాస్కర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్‌తో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బన్నీనీ ఏ11 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా బి.ఆర్. గవాయ్ ఎన్నికయ్యారు. గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. మే 14న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐ పదవి చేపడుతున్న రెండో దళితుడిగా జస్టిస్ గవాయ్. కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్‌ 1985లో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు.
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై కీలక వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై ఈ నెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం..27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో ఐపీఎస్‌లు మహేశ్‌భగవత్‌, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. భూదాన్‌ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని గవర్నమెంట్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌‌ ఎక్స్‌లో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ట్వీట్టర్ వేదికగా స్మితా స్పందించారు. భగవద్గీతలోని "కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన" శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్ట్‌ను ప్రారంభించారు. "పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా అత్యుత్తమంగా సేవలు అందించేందుకు ప్రయత్నించాను. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన టూరిస్ట్ ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా నిలుస్తుంది" అని ఆమె వివరించారు.
ఏప్రిల్‌ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేర‌కు విద్యాశాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది. .ఈ సారి కొత్త‌గా మార్కుల‌తో పాటు స‌బ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పదో తరగతి రిజల్ట్స్ విడుదల చేస్తారని సమాచారం.మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన ప‌ది ప‌రీక్ష‌ల‌కు 5 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.
మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలను భాగ్యనగరంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆపరేషన్ సక్సెస్ .. పేషెంట్ డెడ్ ఇదొక మెడికల్ ఇడియమ్. అయితే రాజకీయాలలోనూ ఈ నానుడి తరచూ వింటూనే ఉంటాం. విజయవంతమైన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి కూడా విశ్లేషకులు అదే అంటున్నారు. అవును.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం (ఏప్రిల్ 27) ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ, జన సమీకరణ వరకూ సక్సెస్ అయింది.
జమ్ముకాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం విరాళం ప్రకటించింది. పార్టీ తరపున ₹50 లక్షల ఆర్ధిక సహాయం, అలాగే జనసేన పార్టీ ప్రమాద బీమా నుండి ₹5 లక్షల ఇన్సూరెన్స్ తో కలిపి మొత్తంగా ₹55 లక్షలు అందించనున్నామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరుపున ఉగ్ర మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కేసీఆర్ ప్రసంగంలో మునుపటి వాడీవేడీ లేకపోవడం అటుంచి కేసీఆర్ తన ప్రసంగంలో చంద్రబాబు గురించి అసత్యాలు చెప్పారనీ, తద్వారా జనంలో చంద్రబాబును తెలంగాణకు బూచిగా చూపించి, ఆయనకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ కు ఉన్న అనుబంధం తెలంగాణకు నష్టం చేకూరుస్తుందని చెప్పడానికి నానా ప్రయాసా పడ్డారని పార్టీ వర్గాలే అంటున్నాయి.
తమిళనాడు నీలగిరి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించింది. రాత్రిపూట ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చి గదిలో కలియతిరిగింది. లోపల ఎవరూ కనిపించకపోవడంతో కాసేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఘటన జరిగింది. అది గమనించిన ఓ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యారు.
జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.