ఆవులకు రక్షణ ఉంది.. కానీ, మహిళలకు లేదు.
Publish Date:Jul 24, 2018
Advertisement
'ఇoట గెలిచి రచ్చ గెలవాలి' అంటారు కానీ బీజేపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.. ఎన్డీయే అనే ఇంట్లో బీజేపీతో కలిసి ఉన్న మిత్రపక్షాలు ఒక్కోటి దూరమవుతున్నాయి.. కొన్నిఅయితే మోడీ సర్కార్ ను వ్యతిరేకిస్తూ విమర్శలు కూడా చేస్తున్నాయి.. ప్రస్తుతం శివసేన అదే చేస్తుంది.. రీసెంట్ గా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. 'లోక్‌సభలో అవిశ్వాసం పెట్టింది ఎవరు?.. బీజేపీ మిత్రపక్షం టీడీపీ.. దేశంలో తొలిసారి ఓ మిత్రపక్షం ఈ తీర్మానం తెచ్చింది.. మిత్రులు ఎందుకిలా అవిశ్వాసం వ్యక్తంచేస్తున్నారన్నదే ప్రశ్న' అని ఠాక్రే అన్నారు.. 'ఎవరు ఎవరిపై అవిశ్వాసం చూపాలి.. మేం ప్రతిపక్షంతో సాగాలా? కానీ ఇన్నేళ్లూ అవేం చేస్తున్నాయి? ప్రజలను ప్రభావితంచేసే అంశాలపై అవి మాట్లాడుతున్నాయా?.. అందుకే మేం ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యామని' అన్నారు.. అలానే మోడీ ప్రభుత్వం గురించి ఘాటు వ్యాఖ్యలు చేసారు.. 'ఈ దేశంలో ఆవులకు రక్షణ ఉంది.. కానీ, మహిళలకు లేదు.. వారి బదులు ఆవులను కాపాడుతున్నారు.. ప్రపంచంలోనే మహిళలకు భద్రత లేని దేశంగా భారత్ మారింది.. ఇందుకు సిగ్గుపడాలి’ అన్నారు.. 'ప్రభుత్వంలో మేమూ భాగస్వాములమే.. కానీ, తప్పు జరుగుతుంటే తప్పకుండా మాట్లాడతాం.. మేం భారతీయ జనతాకు మిత్రులం.. అంతేకానీ, ఏ పార్టీకీ కాదు' అని స్పష్టం చేసారు.. అదే విధంగా 'మేం సామాన్యుడి కల నెరవేర్చడానికి పోరాడుతున్నాం.. మోదీ కల నెరవేర్చడానికి కాదు’ అని ఠాక్రే అన్నారు.
http://www.teluguone.com/news/content/you-want-to-save-gau-mata--but-what-about-mata-says-uddhav-thackeray-39-82702.html





