తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సంచలనం రేగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఆమె 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పేరుతో సరికొత్త ప్రాంతీయ పార్టీని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే పార్టీ పేరు కంటే కూడా, ఆమె ఎంచుకున్న పార్టీ జెండా రంగు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతోంది. కవిత తన టిఆర్ఎస్ పార్టీకి పసుపు రంగును అధికారిక రంగుగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. పసుపు రంగు అనగానే అందరికీ గుర్తుకువచ్చేది తెలుగుదేశం పార్టీ. దీంతో రాజకీయ వర్గాల్లో రకరకాల కుట్ర సిద్ధాంతాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకప్పుడు గులాబీ జెండాతో నడిచిన కవిత, ఇప్పుడు పసుపు జెండాను ఎంచుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనే దానిపై జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
ఈ వివాదంపై.. పసుపు రంగు ఎంపికపై వస్తున్న విమర్శలపై కల్వకుంట్ల కవిత తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. పసుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు. ఈ రంగు ఎంపిక వెనుక రాజకీయ వ్యూహాల కంటే బలమైన సెంటిమెంట్ దాగి ఉందని ఆమె వివరించారు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు పసుపు రంగుతో విడదీయరాని, ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని గుర్తు చేసిన కవిత.. నిజామాబాద్ జిల్లాలో పండించే ప్రధాన పంట పసుపు (టర్మరిక్) అని, అక్కడి రైతులకు, ప్రజలకు ఈ రంగుతో విపరీతమైన సెంటిమెంట్ ఉందని వివరించారు. ఒకప్పుడు తాను పార్లమెంట్‌లో నిజామాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించానని, తన భర్త దేవనపల్లి అనిల్ కుమార్ సైతం నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పోతంగల్ గ్రామానికి చెందినవారేనని చెబుతూ తన నిజామాబాద్ బంధాన్నిచెప్పుకొచ్చారు.
కేవలం రైతు సెంటిమెంట్ మాత్రమే కాదు.. పసుపు రంగు ఎంపిక వెనుక ఒక బలమైన మహిళా సెంటిమెంట్ కూడా ఉందని కవిత చెప్పారు. . ఒక మహిళగా పుట్టినప్పటి నుండి చివరి శ్వాస వరకు ప్రతి ఆడబిడ్డ పసుపు కుంకుమ' ఆశీర్వాదాలను ఎంతో పవిత్రంగా భావిస్తుందని, పసుపు కుంకుమలను కోరుకుంటుందని అన్నారు. అందుకే ఒక మహిళగా పసుపు రంగు తన హృదయానికి ఎంతో దగ్గరైనదని, అందుకే తన కొత్త తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీకి ఈ రంగును ఎంచుకున్నానని స్పష్టం చేశారు.
కవిత ఇంతటి స్పష్టమైన, భావోద్వేగ వివరణ ఇచ్చినప్పటికీ, రాజకీయాల్లో ఈ పసుపు రంగుపై సాగుతున్న మైండ్ గేమ్స్ అంత సులభంగా ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా బిఆర్ఎస్ శ్రేణులు ప్రతి చిన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో.. కేసిఆర్ సొంత రక్తమైన కవితను చంద్రబాబు ఏజెంట్ అని విమర్శించడం పరోక్షంగా కేసిఆర్‌ను అవమానించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yellow-flag-for-kavitha-trs-party-39-221418.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.