యలహంక భూమి షర్మిలదే: కుండబద్దలు కొట్టిన విజయమ్మ: జగన్ కు షాక్.!

Publish Date:Oct 26, 2026

Advertisement

యలహంక భూమి, ఆస్తుల విషయంలో వైఎస్ సతీమణి, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్   సొంత తల్లి విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. యలహంక భూమి, ఆస్తులు తన కుమార్తె షర్మిలవేనని ఆమె గతంలో చేసిన ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  బెంగళూరులోని  యలహంక ప్యాలెస్ ప్రాంగణంలో ఉన్న ఆస్తి,  భూమి తన కుమార్తె వైఎస్ షర్మిలకు చెందినదేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి , జగన్, హర్మిల తల్లి వైఎస్ విజయమ్మ గతంలో విస్పష్టంగా ప్రకటించారు.

ఇప్పుడు షర్మిల కుమార్తె వివాహానికి యలహంక ప్యాలెస్ ను వేదికగా ఇవ్వలేనంటూ జగన్ మొండికేసిన నేపథ్యంలో గతంలో విజయమ్మ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సొంత తల్లే యలహంక ప్యాలెస్ ప్రాంగణంలోని భూమి షర్మిలదే అని ప్రకటించిన తరువాత జగన్ షర్మిల కుమార్తె వివాహ వేడుక జరుపుకోవడానిక ఆ ప్యాలెస్ ను ఎలా నిరాకరిస్తారని నెటిజనులు నిలదీస్తున్నారు. 


ఇప్పటికే  వివాహ వేదిక వివరాలను పేర్కొంటూ ఆహ్వాన పత్రికలను ముద్రించి బంధుమిత్రులకు  పంపిణీ చేసిన తరువాత..  ప్రాంగణంలో పెళ్లి వేడుక నిర్వహించడానికి వీలులేదంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకోవడంపై వైఎస్ కుటుంబ సభ్యుల నుంచే కాకుండా.. వైఎస్ అభిమానులు, సామాన్య జనం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల కుమార్తె వివాహవేడుకకు యలహంక ప్యాలెస్ వేదిక చేస్తూ..  భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని,  జగన్ ఓ లేఖ ద్వారా తన అభ్యంతరాలను వెల్లడించిన నేపథ్యంలో  జగన్, షర్మిల మధ్య విభేదాలు, ఆస్తుల వివాదం మరోసారి రచ్చకెక్కింది.  

యలహంక ప్యాలెస్ తనదనీ,  తన భద్రత, తన  కుటుంబ భద్రత దృష్ట్యా అక్కడ  షర్మిల వివాహం జరిగేందుకు అంగీకరించలేననీ జగన్ పేర్కొనడంతో కుటుంబ విభేదాలు. ఆస్తుల వివాదాలు మరో సారి రచ్చకెక్కాయి.  ఈ నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మ గతంలో విడుదల చేసిన ప్రకటన  ప్రాధాన్యత సంతరించుకుంది. రాజశేఖరరెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబానికి చెందినవేనని, వాటిని నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయమని విజయమ్మ ఆ ప్రకటనలో గుర్తుచేశారు.

వైఎస్ఆర్ఆర్ మరణానంతరం ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం షర్మిలకు దక్కాల్సిన ప్రతి ఆస్తి ఆమెకు చెందాలని, కానీ ఆచరణలో ఆమెకు అన్యాయం జరుగుతోందని విజయమ్మ ఆరోపించారు. సరస్వతి సిమెంట్ కంపెనీతో పాటు, అప్పట్లో కుదిరిన అవగాహన ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, బెంగళూరులోని యలహంక భూమి,  ఆ ప్యాలెస్ ప్రాంగణానికి సంబంధించిన హక్కులు పూర్తిగా షర్మిలవేనని విజయమ్మ విస్పష్టంగా ప్రకటించారు. జగన్  ఆ ఆస్తిపై సర్వాధికారాలూ తనవేననడం పూర్తి అభద్ధమని విజయమ్మ గతంలోనే కుండబద్దలు కొట్టారు.   

[Yelahanka Land Dispute, YS Sharmila, YS Jagan Mohan Reddy, YS Vijayamma Statement, YS Family Properties, Telugu One]

By
en-us Political News

  
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.