కడప కంచుకోటకు బీటలు.. వైసీపీకి పరాభవం తప్పదా?

Publish Date:Jul 10, 2023

Advertisement

కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు జగన్ హయంలో వైసీపీకి ఉమ్మడి కడప జిల్లానే వాళ్ళ రాజకీయాలకు అతి పెద్ద ప్లస్ పాయింట్. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి తిరుగులేదన్నది నిన్నటి వరకూ రాజకీయాలలో వినిపించే మాట. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఆ జిల్లా ప్రజల నుండే మిశ్రమ స్పందన వస్తుంది. వైసీపీ సహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే పలుమార్పు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు జరిపిన సంగతి తెలిసిందే. ఆయా సర్వేలలో కడప జిల్లా ప్రజల నుండి ఆసక్తికర అభిప్రాయాలు బయటపడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ సొంతంగా నిర్వహించుకున్న సర్వేలు, వైసీపీ తరపున నిర్వహించిన సర్వేలలో కూడా ప్రజల నుండి వ్యతిరేక అభిప్రాయాలు బయటపడగా అవేవీ బయటకి రాకుండా చూసుకున్నట్లు తెలుస్తున్నది.

మొత్తంగా చూస్తే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి వైసీపీకి ఊహించని షాక్ తప్పదనే అభిపాయాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి క‌డ‌ప‌ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండగా రాజంపేట, కడప పార్లమెంట్ పార్ల‌మెంటు స్థానాలు కూడా ఉన్నాయి. వైసీపీ ఆవిర్భవించిన అనంతరం జరిగిన 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఒక్క రాజంపేటలో హవా చూపించలేకపోయింది. ఆ తర్వాత 2019లో రాజంపేట స‌హా మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాలు దక్కించుకొని క్లీన్ స్వీప్ అంటే ఏంటో చూపించింది. ఆ రెండు ఎన్నికలలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై సానుభూతితో పాటు వైఎస్ కుటుంబం మొత్తం ఏకతాటిపై నిలబడి జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయాలని అన్ని నియోజకవర్గాలకు తిరిగారు. 2019 ఎన్నికలలో అయితే, వివేకానంద రెడ్డి హత్య, కోడికత్తి దాడి, జగన్ ఒక్క ఛాన్స్ అభ్యర్థన అన్నీ కలిసి వచ్చి క్లీన్ స్వీప్ చేయగలిగింది.

అయితే, ఆ హ‌వా ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఈసారి ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం అసాధ్యమే కాకుండా గతంలో ఎన్నడూ లేనంతగా ఇక్కడ ప్రజలు దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి మొత్తంగా నాలుగైదు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. వైసీపీకి వ్యతిరేక పవనాలలో కీలకమైనది కుటుంబంలో వివాదాలు. జగన్మోహన్ రెడ్డి నుండి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల దూరమవడం, మరో సోదరి సునీత సొంత కుటుంబంపైనే న్యాయ పోరాటం చేయడం.. ఈ కారణాలతో  వైఎస్ హార్డ్ కొర్ అభిమానులు జగన్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయానికి విజయమ్మ కనీసం ఒకటి రెండు నియోజకవర్గాలలో ప్రచారం చేయకపోతే ఈ నష్టం తీవ్రత ఊహకు అందనంతగా   ఉండే అవకాశం ఉంది. 

వైసీపీ వ్యతిరేక గాలి వీయడం వెనక మరో బలమైన కారణం వివేకా హత్య. గత ఎన్నికల సమయంలో ఈ హత్య వైసీపీకి చేసిన మేలు అంతా ఇంతా కాదు. అసలే తండ్రి లేని కుమారుడు, కక్ష పూరితంగా జైల్లో పెట్టారనే సానుభూతికి తోడు అండగా ఉంటాడుకున్న చిన్నాన్నను కూడా లేకుండా చేశారనే సానుభూతి బాగా వర్క్ అవుట్ అయింది. అయితే, ఇప్పుడు ఆ కుట్ర సొంత వాళ్ళ పనే అనే అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత తలెత్తే ఛాన్స్ ఉంది. రాయలసీమకి న్యాయరాజధాని తెస్తానని ఊరించడం.. ఇదిగో వస్తుంది.. మాట తప్పం మడం తిప్పం అంటూనే కాలం గడిపేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ఇక అన్నిటికీ మించి స్థానిక ప్ర‌జ‌ల డిమాండ్‌ను ప‌రిష్క‌రించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో వైసీపీ నేతల మధ్య సఖ్యత కొరవై రచ్చకెక్కడం ప్రజలలో ఏహ్యభావన కలిగిస్తోంది. అదే క్రమంలో ప్రతిపక్ష టీడీపీ ఇక్కడ బలం పుంజుకున్నది. దీంతో ఇప్పుడు మొత్తంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి సగానికి సగం స్థానాలను వైసీపీ చేజార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.