ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర.!

Publish Date:Jul 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాయలసీమ వ్యాప్తంగా ప్రధాన పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో   ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మధుసూదన్ రెడి మాట్లాడారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని మధుసూదన్ రెడ్డి అన్నారు.   

ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి,  ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా బట్టకాల్చి మీదేసే రాజకీయాల వల్ల ప్రజల్లో నేతలపై నమ్మకం సడలిపోతుందన్నారు.

గతంలో కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు, ఆ తర్వాత దళిత క్రైస్తవ అంశాలను తెరపైకి తెచ్చి అలజడులు సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ వరుస ఎపిసోడ్లను నడిపిందన్న ఆయన..  ఇప్పుడు రాప్తాడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో పరిటాల సునీత కుటుంబం, స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఒకేసారి దాడులకు దిగడం వెనుక రాజకీయ వైరుధ్యాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చే కుట్ర దాగి ఉందన్నారు. అహోబిలం దేవస్థానం సొమ్ముపై గంగుల కుటుంబం చేస్తున్న ఆరోపణలు కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ కాంట్రాక్ట్ పనులు, లిక్కర్ వ్యాపారాల్లో అవినీతి ఇంకా పూర్తిగా సమసిపోలేదన్న మధఉసూదన్ రెడ్డి.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్ల పనుల్లో కూడా కొందరు ప్రభుత్వ అధికారులు ఏడు శాతం వరకూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయమై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరిట సొంత వారికి కట్టబెట్టిన గాలేరు, నగరి, హంద్రీనీవా పనుల్లో జాప్యం వల్లే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు.

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసురుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, నాలుగు మసాలా వార్తలు వినా నిజాలు బయటకు రావన్నారు. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే..  బాధితులు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. చట్టపరమైన విచారణ జరిపించి, ఆధారాలు చూపని వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ప్రశాంతమైన వాతావరణం కొనసాగాలన్నా కూటమి ప్రభుత్వం అలజడులు సృష్టించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను గౌరవిస్తూ తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఏపీలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విశ్లేషించారు.

AP Politics Analysis,  MS Raju vs Thopudurthi Prakash Reddy,  Rayalaseema Political Riots, Kutami Government Law and Order

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.