నీట్ వివాదంలోకి డీఎస్సీని లాగేందుకు వైసిపి యత్నం.. వర్కౌట్ అయ్యేనా?

Publish Date:Jul 23, 2026

Advertisement

దేశవ్యాప్తంగా ప్రస్తుతం నీట్   లీకేజీ వ్యవహారం   కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ వీధుల నుంచి మొదలైన విద్యార్థుల నిరసన జ్వాలలు దేశమంతటికీ వ్యాపించాయి. తమ భవిష్యత్తు, విద్యా హక్కుల రక్షణ కోసం లక్షల మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఎలాంటి జకీయ ప్రమేయం లేకుండా,   విద్యార్థుల హక్కుల కోసం సాగుతున్న ఈ  పోరాటానికి జనబాహుల్యం నుంచి విశేష మద్దతు లభిస్తోంది.   

ఇక్కడే.. ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది.   జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ   మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని   జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.   రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక  అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ,  నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసిపి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది. వైసిపి ప్రధానంగా మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,  ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది. నీట్ వివాదంతో డీఎస్సీని ముడిపెట్టడం ద్వారా యువతలో ఆందోళన రేకెత్తించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.

నీట్ పరీక్షల తీవ్రతకు, ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అంశానికి అసలు పోలికే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడిన నీట్ వ్యవహారం జాతీయ మీడియాలో, సుప్రీం కోర్టులో,  పార్లమెంటులో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వైసీపీ లేవనెత్తుతున్న ఏపీ డీఎస్సీ విషయంలో స్థానికంగా అంటే రాష్ట్రంలో కూడా పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు.   జాతీయ స్థాయిలో హోరెత్తుతున్న ఒక స్వచ్ఛంద  విద్యార్థి ఉద్యమంలోకి, రాష్ట్రంలో కూడా ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు రాని డీఎస్సీ అంశాన్ని తీసుకురావాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వృధా ప్రయాసే, కాకుండా ఆ ప్రయత్నాలు వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.  

YCP NEET Protests, AP Mega DSC Issue, YSRCP July 28 Rally

By
en-us Political News

  
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.