ప్రభుత్వ ముసుగువేసుకున్న వైసీపీ కార్యకర్తలు?!

Publish Date:Nov 3, 2023

Advertisement

సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఈ రెండు పేర్లు గత 53 రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో  చాలా ఎక్కువగా వినిపించిన పేర్లు. మీడియాలో ఎక్కువగా కనిపించిన పేర్లు. అయితే వీరేం రాజకీయ నాయకులు కారు. వీరిరువురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ కాగా.. మరొకరు ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్. తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్ట్ నుండి స్కిల్ కేసు న్యాయస్థానాలలో విచారణ వరకూ ఈ ఇద్దరూ ఎక్కడా  నిబంధనలను పాటించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లుగా వ్యవహరించలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని అందరూ నిర్ధారించారు. 17ఏ సెక్షన్ కింద సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నేతను అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కానీ  చంద్రబాబు అరెస్టు కనీసం గవర్నర్ కు సమాచారం కూడా ఇవ్వకుండానే అర్ధరాత్రి ఆయన బస చేసిన శిబిరాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకూ అసలు ఎఫ్ఐఆర్ అనేదే లేకుండా ఈ అరెస్ట్ జరిగింది.  కోర్టులో విచారణ మొదలయ్యాక హడావుడిగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు చంద్రబాబును సీఐడీ విచారణకు అప్పగించినా ఈ కేసులో ఆయన పాత్ర లేకపోవడంతో సీఐడీ విచారణ కూడా వృధానే అయింది.

మొత్తం 52 రోజులుగా ఏసీబీ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకూ ఈ కేసులో విచారణ సాగినా.. ఎక్కడా స్పష్టమైన ఆధారాలు సీఐడీ  న్యాయస్థానాలకు అందించలేకపోయింది.   పైగా జైల్లో చంద్రబాబు సదుపాయాలపై కూడా సీఐడీ ఎక్కడిక్కడ అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీనిని బట్టి చూస్తే సీఐడీ కేవలం ప్రభుత్వ పెద్దల ఆనందం కోసమే పనిచేస్తున్నదనీ, ప్రభుత్వ కక్షసాధింపులో సీఐడీ పావుగా మారిందని అందరికీ స్పష్టంగా అర్ధమైంది. ఇంకా చెప్పాలంటే జగన్ సర్కార్ ఇలా వేధింపుల కోసమే సంజయ్ ను సీఐడీ చీఫ్ గా నియమించుకున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అంతకు ముందు విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ కు సీఐడీ అదనపు బాధ్యతలు అప్పగించి మరీ జగన్ సర్కార్ తీసుకొచ్చింది.

గతంలో సంజయ్ పై రాయలసీమలో పనిచేసే సమయంలోనే వైసీపీ వాదిగా ముద్ర ఉంది.  ఇక ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసు మొదలైన దగ్గర నుండి ఈయన  ఏఏజీ లా కంటే.. వైసీపీ కార్యకర్తలానే ఎక్కువగా వ్యవహరించారు. ఈ కేసు విచారణ మొదలైన తొలి రోజు నుండే మీడియాకెక్కిన పొన్నవోలు నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి చంద్రబాబు దోషి అంటూ రచ్చ రచ్చ చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా.. అదే కేసులో వాదనలు వినిపించే న్యాయవాది కేసుకు సంబంధించి వివరాలను బహిర్గతం చేయకూడదనే నిబంధన తెలిసినా అడ్డగోలుగా మీడియా చర్చలో పాల్గొన్నారు. అసలు పసలేని కేసులో భారీ కుంభకోణం అనేలా చిత్రీకరించేందుకు సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు శాయశక్తులా కృషి చేశారు. నారా లోకేష్ ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించి ఈ కేసు గురించి జాతీయ స్థాయి మీడియాకు వివరణ ఇచ్చిన అనంతరం సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు ప్రభుత్వ డబ్బుతో ఢిల్లీ వెళ్లి  అక్కడా చంద్రబాబును అవినీతి పరుడిగా ముద్రవేసేందుకు కేసు వివరాలను వెల్లడిస్తూ మీడియా సమావేశాలలో మాట్లాడారు. 

 ఈ వ్యవహారంపై  హైకోర్టులో పిటిషన్  దాఖలైంది. స్కిల్  కేసు దర్యాప్తులో ఉండగా సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ సుధాకర్ రెడ్డిలు మీడియా సమావేశాలు ఏర్పాటు కేసు గురించి మాట్లాడారనీ, ఆ క్రమంలో  ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు  పిటిషన్ దాఖలు చేశారు.  ప్రజాధనం దుర్వినియోగంపై ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని పిటిషనర్ తెలిపారు. ఆ పిటిషన్ ను విచారించిన  హైకోర్టు ఆర్టీఐ కింద కోరిన సమాచారం ఇవ్వకపోవడం   చట్టవిరుద్ధమేనని పేర్కొంది. మరో సారి ఆర్టీఐని వివరాలు ఇవ్వాలని కోరాల్సిందిగా పిటిషనర్ కు సూచించింది.  ఇక తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయంలో కూడా హైకోర్టులో పొన్నవోలు వితండవాదం వినిపించారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకోలేదని పొన్నవోలు హైకోర్టులో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా హైకోర్టు ఆగ్రహించింది. మార్గదర్శకాల ప్రకారమే తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేశామని స్పష్టం చేసిన హైకోర్టు.. ఏవైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళమని సూచించింది. అంతే కాదు  కోర్టు తీర్పులు ఎలా ఇవ్వాలో కూడా మీరే చెప్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తే సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు అధికారుల ముసుగేసుకున్న వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారన్నది తేటతెల్లమౌతోందని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.