వైసీపీ ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బింది.. రఘురామకృష్ణం రాజు

Publish Date:Feb 16, 2023

Advertisement

నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది.. ఆ మాటలతో మాట్లాడిన వారికేం సంబంధం లేదు అన్నట్లుగా ఉంది రాజధాని విషయంలో అధికార వైసీపీ నేతలు, మంత్రులు, సలహాదారులు మాట్లాడుతున్న మాటలు. ఏ నిముషానికి ఎవరేం మాట్లాడతారో తెలియక ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎవరు చెప్పింది నమ్మాలో తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి.

పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులే పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుంటే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నోరు మెదకపోవడం చూస్తుంటే.. ఈ గందరగోళ వ్యాఖ్యల వెనుక ఏదో వ్యూహం ఉందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కార్ తీరు రాజధాని విషయంలో అయోమయం సృష్టించి పబ్బం గడుపుకోవడమే ఆ వ్యూహం అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు అన్నది  మిస్ కమ్యూనికేషన్ అని, విశాఖపట్నం మాత్రమే ఏపీ రాజధాని అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెబితే.. అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా జగన్ మూడు రాజధానుల కు కట్టుబడి ఉన్నారని చెబుతూ.. అయితే రాజధాని అన్న పేరు లేకపోవచ్చు కానీ విశాఖతో పాటు అమరావతి, కర్నూలు కూడా రాజధానులేనని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయరాజధాని అని చెప్పి, వాటినీ అభివృద్ధి చేస్తామనీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.    

బుగ్గన ఏ సందర్భంలో విశాఖ ఒక్కటే రాజధాని అని  చెప్పాలో తెలియదని..  వైజాగ్ లో సచివాలయం, అమరావతి లో  అసెంబ్లీ, కర్నూలులో హై కోర్ట్ కర్నూలు  ఇదే మా విధానం అని మీడియాకు చెప్పారు.  అయితే సుప్రీం కోర్టులో మాత్రం ప్రభుత్వం న్యాయరాజధాని అనేదే లేదని విస్పష్టంగా చెప్పేసింది. విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బుగ్గన, అంతకు ముందు ఢిల్లీలో సీఎం జగన్ విశాఖపట్నం మాత్రమే ఏపీ రాజధాని అని విస్పష్టంగా చెప్పారు. రోజుల వ్యవధిలో పార్టలోని ముగ్గురు కీలక నేతల నోటి వెంట రాజధాని విషయంలో వచ్చిన ఈ భిన్న ప్రకటనలు దేనికి సంకేతం?   పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాజధానిని,  తిరిగి పార్లమెంటు చట్టం ద్వారానే మార్చడానికి వీలవుతుంది కానీ, బుగ్గన, సజ్జల, ధర్మాన ప్రసాదరావు లు చెప్పిన విధంగా కాదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఏపీ ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా స్థిరత్వంలో అస్దిరత్వం అన్న వింత విధానాన్ని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు రఘురామకృష్ణం రాజు. రచ్చబండలో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 15)  మీడియతో మాట్లాడిన రఘురామరాజు  రాజధాని విషయంలో మంత్రుల మాటలు చూసి ప్రజలు మాత్రం ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బిందని అంటున్నారని ఆయన అన్నారు.  రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈనెల 23వ తేదీ నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖాలు ద్వారా, అమరావతే రాజధాని అని స్పష్టం చేసిందన్నారు.   రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలను చూసి, అమరావతి రైతులు నవ్వుకోవాలి తప్పితే, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఓటమి భయంతో ప్రభుత్వ పెద్దలు సంధి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.  

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.