వైసీపీ సామాజిక బస్సు యాత్ర.. తిరుగుబాటుకు ప్రజలు సిద్ధం!

Publish Date:Oct 25, 2023

Advertisement

ఏపీలో ఈసారి అధికారం ఎవరిది అంటే ఇప్పటికే   జనం క్లియర్ కట్గా  తేల్చి చెప్పేస్తున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం తెలుగుదేశం  అధికారం చేపట్టడం తథ్యం అంటూ విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ ఎంతటి ఘన విజయం దక్కించుకుందో.. ఈసారి ఎన్నికలలో అంతటి ఘోర పరాజయం తప్పదని లెక్కలేసి మరీ చెప్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. ప్రతిపక్ష  తెలుగుదేశం లో గెలుపు ధీమా స్పష్టంగా కనిపిస్తుంటే.. ఓటమి బెరుకు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.  ఏదో ఒక మాయ చేసో.. మతలబు చేసో మరోసారి ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని చూసినా ఆ పరిస్థితి కూడా చేయి దాటి పోయిందని అంటున్నారు. కుట్ర పన్ని టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంతో  వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. అయితే, వైసీపీ పెద్దలు మాత్రం గెలుపు మనదే అంటూ పార్టీ నేతలను, క్యాడర్ ను నమ్మించేందుకు వృధా  ప్రయత్నం చేస్తున్నారు. లోలోపల ఓటమి భయం వెంటాడుతున్నా.. పైకి మాత్రం మన బటన్ నొక్కుడే మనల్ని కాపాడుతుందని నమ్మిస్తున్నారు. ప్రజలకు మనం ఏం చేశామో ప్రజల వద్దకే వెళ్లి తెలియజెప్పండి అంటూ ఆదేశిస్తున్నారు.

ఇప్పటికే గడపగడపకి అనే కార్యక్రమంతో మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ అందరినీ ఇంటింటికి పంపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి బస్సెక్కించి ప్రతి గ్రామానికి పంపిస్తున్నారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో మొదలవనున్న ఈ యాత్ర రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ సాగుతుంది. ఈ యాత్రలో మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ  ఇన్వాల్వ్ కావాలని ఆదేశించారు. ఇంకా చెప్పాలంటే పార్టీ మొత్తం కదిలేలా.. డిజైన్ చేసిన ప్రోగ్రాం ఇది. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగి.. నాలుగున్నరేళ్లలో వాళ్లకి ఏం చేశామో చెప్పాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం (అక్టోబర్ 26) నుంచి ఏపీ వ్యాప్తంగా ఈ వైసీపీ సామాజిక బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఒకేసారి ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రా లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమ లో అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఒకేసారి ఈ యాత్ర మొదలు కానుంది. అరవై రోజులు సాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 31తో పూర్తి అయ్యేలా రూపకల్పన చేశారు.

అయితే  ఈ యాత్రలో కానీ, ప్రతిరోజూ జరిగే బహిరంగ సభలలో కానీ ఎక్కడా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించరు. ఆ మాటకొస్తే ఎక్కడా వైసీపీ ముఖ్యనేతలు కూడా కనిపించరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత నేతలే ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి భయంతో సగం డీలా పడిపోగా.. ద్వితీయ శ్రేణి నేతలంతా ప్రభుత్వంపై పీకల వరకూ అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది వైసీపీ ముఖ్యనేతలు కనిపిస్తేనే కాస్త వాళ్లలో కదలిక వస్తుంది. కానీ, వాళ్లనే బస్సెక్కి వెళ్ళండి అంటున్నారు. ఇప్పటికే గడపగడపకి వెళ్లిన వీళ్లు ప్రజల స్పందన ఎలా ఉందో చూసేశారు. ఇప్పుడు మరోసారి  ప్రజల వద్దకు వెళ్లి మరో అవకాశం ఇవ్వాలని కోరితే రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియనిదేమీ కాదు. దీంతో ఈ యాత్ర చివరి వరకూ సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ సామజిక బస్సు యాత్ర సక్సెస్ కావాలంటే ముందుగా కావాల్సింది రోడ్లు. ప్రతి గ్రామానికి బస్సు వెళ్లాలంటే రోడ్లు సక్రమంగా ఉండాలి. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అలాంటిది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోడ్ల మీద నుండి ప్రజల వద్దకి వెళ్తే ఎదురయ్యే తొలి ప్రశ్న అదే అవుతుంది. గ్రామాల నుండి పట్టణాల వరకూ.. గూడేల నుండి నగరాల వరకూ అడుగడుగునా సమస్యలు తాండవం చేస్తున్నాయి. సవాలక్ష కొర్రీలు పెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల అసంతృప్తి ప్రజలలో పెల్లుబుకుతున్నది. సీఎం జగన్మోహన్ రెడ్డి హామీలిచ్చి అమలు చేయని అంశాలు, నాలుగేళ్లుగా మాటలే తప్ప అడుగు ముందుకు పడని ప్రాజెక్టులు లాంటి ఎన్నో అంశాలతో ప్రజలలో ఆగ్రహాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి.  ఇలాంటి సమయంలో ప్రజల వద్దకు పాలకులు వెళ్తే ఏ స్థాయిలో రియాక్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సామజిక బస్సు యాత్ర వైసీపీకి ఏ స్థాయి రియాక్షన్ ఎదుర్కొంటుందో చూడాలి.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.