తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ పంచాయతీలు.. పెదరాయుడి పాత్రలో జగన్

Publish Date:Jun 21, 2022

Advertisement

 ముఖ్యమంత్రి  జగన్ క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ఫ్యాలెస్‌ ఇప్పుడు పంచాయతీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతే.. ఆ పంచాయతీలు విని తీర్పులు ఇచ్చే పెదరాయుడి పాత్రలో జగన్ జీవిస్తున్నారట. నిన్న మొన్నటి వరకు జగన్ మలి కేబినెట్ కూర్పులో భాగంగా.. పదవి పోయిన మాజీలను, పదవి రానీ అసమ్మతీయులను బుజ్జగించి దారికి తెచ్చుకునే పనిలో బిజీబిజీగా గడిపిన జగన్ ఇప్పుడు కొంచం ఊపిరి పీల్చుకుందామనుకునే సరికి  కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి.

ఒకటా రెండా.. మొత్తం 13 జిల్లాలు.. లోక్ సభ స్థానాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందీ జగన్ ప్రభుత్వం.  దీంతోనే అసలు సమస్య రాజుకొందని పార్టీ నేతలు అంటున్నారు.   అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు.. ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో పార్టీ అధినేత  జగన్ సతమతమౌతున్నారని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. జిల్లాల మార్పుతో అనవసర తలనొప్పులు  తెచ్చుకున్నట్లైందని మధన పడుతున్నారుని అంటున్నారు.  బీసీ సామాజిక న్యాయ భేరి పేరిట 17 మంది మంత్రులతో కూడిన బస్సు యాత్ర ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. కానీ ఈ యాత్ర తుస్సుమంది. అలాగే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా నిరసన సెగ తీవ్రంగా తగిలింది.

దీంతో రాష్ట్రంలో పార్టీ రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయా అన్న అనుమానం వైసీపీ అధినేతలోనే మొదలైందంటున్నారు. దీంతో పార్టీలో ఎక్కడ అసంతృప్తి ఉందని పించినా  అక్కడి వర్గాలను తాడేపల్లికి పిలిపించి బుజ్జగించే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.   ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వర రెడ్డి తనయుడికి.. ఆయన సోదరుడి కుమారుడికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని సమాచారం. దీంతో వారిని తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని పంచాయతీ పెట్టి తీర్పిచ్చేశారు జగన్. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ పని అయిపోవడం, ఇదే జిల్లాలోని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  తెలుగుదేశంపైపు చూపు సారించడం, ఆమె  కుమార్తె కైవల్యా రెడ్డి భర్తతో కలిసి ఒంగోలు వేదికగా ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిసి.. మంతనాలు జరపడంతో జిల్లాలో  ఇతర పార్టీ ప్రముఖులను తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడిన జగన్, ప్రసన్న కుమార్ రెడ్డిని సైతం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతుండటంతో ఆయనను సైతం తాడేపల్లి పిలిపించి మాట్లాడే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా  మంత్రి విడదల రజనీ వర్సెస్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వర్గాలు ఒకరిపై ఒకరు కారాలూ, మిరియాలూ నూరుకుంటున్న పరిస్థితి. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరిల మధ్య పంచాయతీ తెలిసిందే. అలాగే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పంచాయతీని కూడా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ నిర్వహించాల్సిన పరిస్థితి.  పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్.. బుల్లితెర సీరియల్‌లాగా ఎప్పుటి నుంచో కొన.. సాగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అసమ్మతి గళం విప్పడంతో ఆయనపై ఫ్యాన్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకంతో పార్టీ పరువు  గోదారిలో కలిసిందనే టాక్  ఉండనే ఉంది.  విశాఖ జిల్లాలో టీడీపీ జెండాపై గెలిచి... వైసీపీలోకి దూకిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాం రాం చెప్పి.. సైలెంట్ అయ్యారు. ఆయన కూడా కుదిరితే సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి రాజ్యసభకు పంపుతానంటూ ముందే ఉరించి... ఆ తర్వాత ఆవిడను సైతం ఉసురుమనిపించారట. ఇప్పుడీ పంచయతీలన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి. పెదరాయుడు స్టైల్ లో తీర్పు చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే బాధ్యత  జగన్ దేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

వీటన్నిటికీ మించి  ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీకి మంచి బలం, బలగం కూడా ఉంది. కానీ ఆ  జిల్లాలో వైసీపీ క్యాడర్   గంపగుత్తగా  తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. అదొ పంచయతీ జగన్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.  ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో  వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు  పంచాయతీ కూడా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరనుంది.  

By
en-us Political News

  
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.