వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రాఘవరెడ్డి అరెస్టు

Publish Date:Nov 6, 2024

Advertisement

నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందా? జగన్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని సరిహద్దులనూ దాటేసి ఇష్టారీతిగా అడ్డగోలుగా వ్యవహరించిన ఒక్కొక్కరిపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమైందా అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి ఔననే అనాల్సి వస్తోంది. తాజాగా జగన్ అడ్డా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పులివెందులలో మంగళవారం (నవంబర్ 5) అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో వర్రా రవీంద్రరెడ్డి సోషల్ మీడియా వేదికగా విపక్ష నేతలపై అసభ్యకర పోస్టులతో రెచ్చిపోయారు. అప్పట్లో జగన్ అండ ఉండటంతో ఎన్ని ఫిర్యాదులు అందినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా వర్రా రవీంద్రరెడ్డి ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు టార్గెట్ గా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. 

రవీందర్‌రెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అంతేకాదు రవీంద్ర రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేకా హత్యకేసులో జగన్, అవినాష్‌రెడ్డిపై విమర్శలు చేసిన షర్మిల, సునీతపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అప్పట్లో ఆ పోస్టుల్లో.. అవసరమైతే సునీతను కూడా లేపేయండి అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్‌ తల్లి విజయమ్మపైనా పోస్టులు పెట్టడం సంచలనంరేపింది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల, సునీతలు మనస్తాపంతో వర్రా రవీంద్ర రెడ్డిపై అప్పట్లో హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు  అదలా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. కూటమి నేతలపై అత్యంత హేయమైన రీతిలో పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో ఆయనపై మంగళగిరితో పాటు పలు ప్రాంతాల్లో, అలాగే హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. ఈ నేపథ్యంలోనే  పోలీసలు వర్రారాఘవరెడ్డిని  పులివెందులలో అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.  వర్రారవీందర్ రెడ్డి జగన్ అండతోనే సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై చెలరేగిపోయి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టారనడానికి ఆయన జగన్, భారతిలతో దిగిన ఫొటోలే సాక్ష్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.