జనసేనలో వైసీపీ స్లీపర్ సెల్స్!

Publish Date:Oct 19, 2023

Advertisement

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఊహకు కూడా అందని విధంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ వైనాట్ 175 అన్న అధికార పార్టీలో ఇప్పుడు బ్రతుకు జీవుడా అనే భావన కనిపిస్తుంది. నారా లోకేష్ పాదయాత్ర, తెలుగుదేశం అధినేత చంద్రబాబు యాత్రలతో తెలుగుదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడే జోష్ కనిపిస్తుండగా.. అకస్మాత్తుగా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓ రెండు మూడు  రోజులు  మహా అయితే వారంలో చంద్రబాబు బయటకి వస్తారనుకోగా నెల గడిచినా వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు జైలు పాలైతే తెలుగుదేశంను   దెబ్బతీయొచ్చని వైసీపీ భావించగా.. తెలుగుదేశం ఇప్పుడు అంతకు మించిన బలంగా ముందుకు సాగుతున్నది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తుకు ఒకే చెప్పి సమరశంఖం పూరించడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజలలో తెలుగుదేశంకు బలం పెరగడంతో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. 

నిజానికి తెలుగుదేశం, జనసేన పొత్తును వైసీపీ తొలి నుండి జీర్ణించుకోలేకపోతోంది. రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందన్నది వైసీపీ భావన. అందుకోసమే ఈ పొత్తును చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. చేస్తోంది. తెలుగుదేశంకు బీ టీమ్ జనసేన, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, దమ్ముంటే పవన్ ఒంటరిగా  పోటీ చేయాలంటూ రెచ్చగొట్టే పని చేశారు. కానీ, పవన్ నా పార్టీ నా ఇష్టం మీరెవరు చెప్పేందుకు అంటూ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. మాటలతో పని కాకపోవడంతో వైసీపీ కుట్ర పూరితంగా ఈ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు పన్నాగం పన్నినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. జనసేన టార్గెట్ గా వైసీపీ తెర వెనక రాజకీయం నడిపిస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఓ కుట్ర పన్ని జనసేన పార్టీకి భారీ నష్టం చేకూరేలా అమలు పరుస్తున్నట్లు చెప్తున్నారు.

సాధారణంగా టెర్రరిజంలో స్లీపర్ సెల్స్ అని ఒక విభాగం ఉంటుంది. వీళ్ళు సామాన్య ప్రజలలో కలిసిపోయి తీవ్రవాదుల కోసం పనిచేస్తుంటారు. అవసరమైన సమయంలో వీళ్ళు ఆత్మహుతి దాడులకు సిద్దపడి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటారు. తీవ్రవాదులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే వీరికి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి కావాల్సినట్లుగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏపీలో సైతం వైసీపీ జనసేనపై ఇదే తరహా కుట్రకు తెరతీసినట్లుగా తెలుస్తుంది. గత రెండు మూడేళ్లుగా కొందరు వైసీపీ సానుభూతి పరులైన నేతలను ముందుగా జనసేనలోకి పంపించి.. అవసరమైనప్పుడు వారిని జనసేనలో రెబల్స్ గా తెరపైకి తెస్తారు. ముందుముందు వాళ్ళతో రాజీనామాలు చేయించి మిగతా నాయకులలో అభద్రతా భావం కలిగిచడం, తద్వారా రాజకీయ శూన్యత సృష్టించి తెలుగుదేశంతో పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీయడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. అలా చేయడం ద్వారా  రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ  చూస్తున్నట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఈ వ్యూహం రూపొందిందని  అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తుపై పవన్ ప్రకటన అనంతరం జనసేనలో వైసీపీ భావాలు కలిగిన నేతలు విభిన్నంగా స్పందించారు. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ.. ఒకరిద్దరు నాయకులు పార్టీకి రాజీనామా చేసి మీడియాకి ఎక్కి పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర విమర్శలకు దిగారు. మరి కొందరు వారిని సమర్ధిస్తూ పార్టీలోనే కొనసాగుతూ విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి వారిపై దృష్టిసారించిన జనసేన నాయకత్వం.. పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు. అయితే, ముందు ముందు సీట్ల సర్దుబాటు సమయంలో వీళ్ళు మరోసారి రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కనుక, వీళ్ళని ముందుగానే గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే జనసేనకు, తద్వారా జనసేన, తెలుగుదేశం కూటమికి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.