జాతరలో వైసీపీ సర్పంచ్ అశ్లీల నృత్యాలు.. వీడియో వైరల్..
Publish Date:Mar 30, 2022
Advertisement
గుడివాడలో కేసినో పెట్టారు. మందేసి చిందేసి తందనాలు ఆడారు. బహుషా మంత్రి కొడాలి నానినే స్పూర్తిగా తీసుకున్నారో ఏమో.. తాజాగా, విశాఖ జిల్లాలో జరిగిన గంగమ్మతల్లి ఉత్సవాల్లో సైతం చిన్నసైజు కేసినో తరహా యవ్వారం నడిపించారు. గుడివాడ మాదిరే ఇక్కడ కూడా వైసీపీ నేతల అరాచకం, హవా కొనసాగింది. రికార్డింగ్ డ్యాన్సులతో రెచ్చిపోయారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్.. స్టేజీ ఎక్కి.. లేడీ డ్యాన్సర్లను పట్టుకోరాని చోట పట్టుకొని.. చాలా అసహ్యంగా, అశ్లీలంగా స్టెప్పులు వేసి.. సభ్య సమాజానికి అసభ్య మెసేజ్ ఇచ్చారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఆ సర్పంచ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ పరువంతా పోయింది. గుడివాడలో మంత్రి కొడాలి నానినే ఇలాంటివి ఎంకరేజ్ చేయగా.. చిన్నాచితకా వైసీపీ నాయకులు సైతం అదే ఫాలో అవుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. పెదబయలు మండల రూఢకోట గ్రామంలో సోమవారం రాత్రి గంగమ్మతల్లి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచి కాతారి సురేష్‌కుమార్ స్టేజి ఎక్కి అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యం చేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఇలా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచి అమ్మాయిలతో అశ్లీల నృత్యం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/ycp-sarpanch-recording-dance-video-viral-39-133699.html





