ఓటమి భయంతో పోటీ నుంచి వైసీపీ పలాయనం

Publish Date:Nov 8, 2024

Advertisement

జగన్ మోహన్ రెడ్డి మాటలకూ చేతలకూ పొంతనే ఉండదు. అవసరానికి తగినట్టుగా ఏదో ఒకటి మాట్లాడేసి తీరా సమయం వచ్చే సరికి మాట మారుస్తారు. మాటతప్పను.. మడమ తిప్పను అంటూనే ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ ఆయన అదే చేశారు. ఇటీవలి ఎన్నికలలో తమ పార్టీ ఓటమికి బ్యాలెట్ బాక్సులే కారణమని, వాటిని ట్యాంపర్ చేసి తెలుగుదేశం కూటమి విజయం సాధించిందనీ ఊరూ వాడా ఏకం చేసేలా ప్రచారం చేసుకున్న జగన్, అదే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే మా సత్తా తెలిసేది అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తీరా ఇప్పుడు బ్యాలెట్ ఎన్నికలు వచ్చే సరికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది.. అందుకే ఎన్నికలకు దూరం అంటే మాట తప్పి  మడమ తిప్పేశారు. జగన్ తీరు చూస్తుంటే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయ్యా అన్న వేమన పద్యం గుర్తుకు రాకమానదు. ఎందుకంటే.. రాష్ట్రంలో కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనూ జరుగుతాయి. దీంతో  ఎన్నికలలో వైసీపీ సత్తా చాటేందుకు వైసీపీకి ఓ చక్కటి అవకాశం దొరికింది.

బ్యాలెట్ ఎన్నికలైతే  మా సత్తా చూపేవాళ్లం అంటూ డప్పాలు కొట్టిన జగన్ ఇప్పుడు ఆ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక పోటీ నుంచే వైదొలిగారు. అసలు ఎన్నికల ప్రకటన వెలువడగానే వైసీపీ  ఆర్భాటంగా ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రెడ్డి పేరును ఊరుకు ముందే ప్రకటించేసింది. ఇక నేడో రేపో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థి పేరు ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. అయితే ఇక్కేడ జగన్ రెడ్డి మడమ తిప్పేసి ముఖం చాటేశారు. ఎన్నికల నుంచి పార్టీ తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయించారు. స్వయంగా ప్రకటించేందుకు ముఖం చెల్లక మాజీ మంత్రి పేర్ని చేత గ్యాడ్యుయేట్ ఎన్నికల బరిలో వైసీపీ నిలబడటం లేదని తేల్చేశారు. ఇక్కడా పాత కథే చెప్పారు. జగన్ తీరు ఎలా ఉంటుందంటే తప్పులు తాను చేసి ప్రత్యర్థులపై నిందలు వేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్ని నాని చేత చేయించిన ప్రకటనలోనూ అలాగే చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందనీ, ఈ ఎన్నికలు ధర్మబద్దంగా జరుగుతాయనే నమ్మకం లేకనే బహిష్కరిస్తున్నామని, అందుకే ఎన్నికలు బహిష్కరిస్తున్నామనీ  పేర్ని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. వాస్తవానికి గత ఎన్నికలలో ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలలో వైసీపీ స్వీపౌట్ అయిపోయింది. అక్కడ గ్యాడ్యుయేట్ ఎన్నికలలో పరాభవం తప్పదని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన  గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే పట్టభద్రులు వైసీపీని ఘోరంగా ఓడించారు. అయితే అప్పట్లో తమ ఓటర్లు వేరే ఉన్నారంటూ అప్పటి పరాజయానికి సాకులు చెప్పుకున్న జగన్.. ఈ సారి ఏకంగా పార్టీని పోటీ నుంచే తప్పించి అధికార తెలుగుదేశం కూటమిపై అభాండాలు వేస్తున్నారు. 

వాస్తవానికి జగన్ హయాంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు అందరికీ ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అప్పట్లో నామినేషన్ వేయడానికి వచ్చి తెలుగుదేశం అభ్యర్థులపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడ్డాయి. నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశాయి. అలాంటి అరాచక పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం స్థానిక ఎన్నికలను బహిష్కరించలేదు. కానీ ఇప్పుడు జగన్ ఓటమి భయంతో బరిలోకి దిగకుండానే పలాయనం చిత్తగించారు. 

By
en-us Political News

  
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.