Publish Date:Feb 13, 2026
వైసీపీ అబద్ధాలు చెప్పి, అబద్ధపు ఆరోపణలు చేసి వాకౌట్ చేస్తోందనీ, ఆ పార్టీకి అబద్ధాలు చెప్పడం తప్ప నిజం వినే ధైర్యం లేదనీ లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇంటర్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా వాకౌట్ అంటూ వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యపై దృష్టి పెట్టడం లేదని వైసీపీ అంటోందనీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అన్నారు లోకేష్.
వైసీపీ ఐదేళ్ల హయాంలో కనీసం పుస్తకాలు, బ్యాగ్స్ ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం రద్దు చేసి వెళ్లిపోయారు. అటువంటి వైసీపీకి ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్దరించామనీ, పుస్తకాలు ఇస్తున్నామనీ చెప్పారు. టెన్త్ , ఇంటర్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. వాకౌట్ అంటూ ఈ తలుపు నుంచి వెళ్లి, టీ తాగి ఆ తలుపు నుంచి వస్తారంటూ ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సమస్యలు లేవని మేం చెప్పడం లేదు, ఉన్నవాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నామని నారా లోకేష్ అన్నారు.
మేం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పరదాలు కట్టుకుని తిరిగారన్న లోకేష్.. అప్పట్లో సీఎం అసెంబ్లీకి వస్తుంటే 3 వేల మంది పోలీసులు రోడ్లపై ఉండేవారనీ, ఇప్పుడు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి వస్తుంటే ప్రజలు నవ్వుతూ చేతులు ఊపుతున్నారన్నారు. ఇప్పుడు జనం ప్రశాంతంగా, హాయిగా తిరుగుతున్నారన్నారు. ఆరోపణలు చేసి పారిపోయిన విపక్ష నేతను సభకు పిలిపించాలని డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-ran-away-from-house-after-false-accusations-39-214006.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.