Publish Date:Jun 27, 2022
తమ పార్టీ నిర్మాత విగ్రహం వద్ద వైసీపీ ప్రభుత్వం డివైడర్లు ఏర్పాటు చేసిందని టిడీపీ శ్రేణులు రెచ్చి పోయారు. డివైడర్లను కాళ్లతో తన్ని కూల్చేసిన సంఘటన నెల్లూరు నర్తకీ సెంటర్ లో జరిగింది. ప్రధాన ప్రతి పక్షం టిడీపీని రాజకీయంగా ఎదుర్కొనలేక వైసీపీ ప్రభుత్వం ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడు తోందని టీడీపీ వర్గీయులు తీవ్రస్థాయిలో నిలదీశారు.
అసలే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అననుకూలించడంతో వైసీపీ ప్రభుత్వం టీడీపి వర్గాలకు అన్ని విధాల సమస్యలు కల్పించాలన్న తలంపుతోనే ప్రతీ చిన్న అంశాన్ని రచ్చచేసి వీధి పోరాటాలకు దిగు తున్నారు. వాస్తవానికి నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర డివైడర్ ఏర్పాటు పార్టీ వర్గీయులను రెచ్చగొట్టడానికి చేపట్టిన చర్యేనని నగర నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడీపీ నేతలు, కార్యకర్తలూ రోడ్డపై బైఠాయంచారు. కార్పోరేషన్ అధికారులను తీవ్రస్థాయి లో నిలదీస్తూ భారీ నినాదాలు చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు లోకి తెచ్చారు.ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ విగ్రహం వద్ద అడ్డంగా డివైడర్ కడితే నేనే పగలగొట్టా.. ఏం పీకుతారు?’ అంటూ సవాల్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాజకీయం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఒక వైపున రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం వద్ద డివైడర్ ను అడ్డంగా ఎలా కడుతుందని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతి లేదని, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాం తాల్లో ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. నర్తకి సెంటర్లో డివైడర్ కావాలని ఎవ రడిగారని, ఎందుకు నిర్మిస్తున్నారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-provokig-tdp-by-its-deeds-39-138554.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.